కొంతమంది ఇంటర్వ్యూలు చూస్తే ఎంత వద్దనుకున్నా నవ్వు ఆపుకోలేం.అలాంటి ఒక ఫన్నీ ఇంటర్వ్యూ ఈ మధ్య కాలంలో వచ్చింది.
ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన నటి పేరు కస్తూరి( Kasturi ).ఆమె అప్పట్లో అన్నమయ్య సినిమాలో నాగార్జున సరసన నటించింది.ఇక టీవీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇంటింటా గృహలక్ష్మి( Grilahakshmi ) అనే సీరియల్ తో చాలా రోజులుగా ఒక ముదురు హీరోయిన్ లాగా కనిపిస్తూ వస్తోంది.సరే ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఆమె చెప్పిన కామెడీ విషయాలు ఏంటంటే ఆమె మహేష్ బాబు పక్కన జోడిగా నటించగలిగే వయసులోనే ఉందట.
తల్లి పాత్రలు చేస్తే ఇంకా 30 ఏళ్ల పాటు చేయాలి.అవే చేద్దామంటే మహేష్ బాబు( Mahesh Babu ) పక్కన ఎలా చేయగలను? మహేష్ కి జోడిలా ఉండే వయసు నాది అంటూ గారాలు పోతుంది.

పైగా జెంటిల్మెన్ సినిమా( Gentlemen movie ) హిందీ రీమేక్ లో ఆమెకు ఛాన్స్ వచ్చిన టైఫాయిడ్ వచ్చిన కారణంగా చేయలేక పోయిందట.మోహన్ బాబు పక్కన కూడా ఒక అవకాశం వచ్చినా ఏదో ఒక కారణంతో చేయలేక పోయిందట.రజనీకాంత్ అయితే మూడుసార్లు అవకాశం ఇచ్చిన ఆమె కు నటించడానికి కుదరలేదట.ఇక చివరిగా కాలా సినిమాలో కూడా నటించాలని బతిమిలాడిన మరీ రజనీ పక్కన యంగ్ గా కనిపిస్తున్న అనే కారణం తో తీసేసారట.
డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ పక్కన మరి యంగ్ అయిపోయిందని తీసేసారట.కస్తూరి ఇంటర్వ్యూ చూసాక అప్పట్లో కొన్ని ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి నా భార్య అని చెప్పిన సునిషిత్ గుర్తొస్తున్నాడు.

ఇంకా నయ్యం లిస్టు ఇక్కడితో ఆపేసింది.మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా చేస్తాను అంటుంది ఈ అమ్మడు వాళ్ళని వదిలేసి సుమా కొడుకు, సునీత కొడుకు, శ్రీకాంత్ కొడుకు పక్కన చేస్తే బాగుంటుంది కదా.వారిని ట్రై చేయాలి ఈమె.అసలు ఇలాంటి ఇంటర్వ్యూస్ ని ఎలా ఎంకరేజ్ చేస్తారో.కానీ మొత్తానికి చాలా కామెడీగా ఆమె సమాధానాలు చెప్పింది.వయసు ఎప్పటికీ పెరగకుండా ఎలా ఉండిపోయారు ఈవిడ అనే అనుమానం వస్తుంది.45 ఏళ్ల హీరో కళ్యాణ్ రామ్ పక్కన 50 ఏళ్ళ కస్తూరి యంగ్ గా కనిపిస్తుందట.అదేంటో ఇంకా ఆవిడకు తెల్ల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలేదట.
నిజంగా 1991 నుంచి సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడికి తల్లిగా నటించే వయసు రాకపోవడం మన సౌత్ ఇండియా ప్రేక్షకులు చేసుకున్న దురదృష్టం.