Telugu Producers : నాలుగైదు భాషల్లో సినిమాలను తెరకెక్కిస్తున్న తెలుగు నిర్మాతలు..అట్లుంటది మనతోని !

ఒక భాషలో సినిమా తీస్తే కేవలం రీజనల్ సినిమాలో నటించాడు అని అంటారు.అదే హిందీలో పాటు పలు భాషల్లో సినిమాలను తీస్తే ఫ్యాన్ ఇండియా స్టార్ అంటారు.

 Tollywood Producers Busy In Other Languages-TeluguStop.com

ఇదే తరహా వ్యాఖ్యలు నిర్మాతలకు కూడా చెల్లుతాయి.కేవలం తెలుగులోనే సినిమా తీస్తే తెలుగు నిర్మాత అంటారు.

కానీ నాలుగైదు భాషల్లో సినిమాలను తెరకెక్కిస్తే పాన్ ఇండియా నిర్మాత అంటారు.ఈ సామెత సరిగ్గా సరిపోతుంది మన టాలీవుడ్ ప్రొడ్యూసర్స్( Tollywood Producers ) కి.ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో కొంతమంది కేవలం ఒక్క తెలుగులో తీసి లాభాలను మూట కట్టుకోవాలి అనుకోవడం లేదు.

ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అయినా సరే పెట్టి పలు భాషల్లో సినిమాలో నిర్మించాలనుకుంటున్నారు.

ఒక భాషలో పోయిన మరొక భాషలో అది వర్కౌట్ అవుతుంది అనే నమ్మకంతో వారు ఇలా ఎంత పెట్టుబడి అయినా పెట్టడానికి సిద్ధపడుతున్నారు.మరి అలా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా నిర్మాతలుగా మారిన ఆ ప్రొడక్షన్ హౌస్ లు ఏంటి ? వారి తెరకెక్కిస్తున్న సినిమాలు ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Allu Arvind, Dil Raju, Geeta, Mythri Makers, Languages, Pratiband, Pushpa

మైత్రి మూవీ మేకర్స్

( Mythri Movie Makers )

ఇప్పటికే పుష్ప సినిమాతో స్టార్ ప్రొడక్షన్ హౌస్ గా మైత్రి మూవీ మేకర్స్ మంచి ఫామ్ లో ఉంది.కేవలం పుష్ప ( Pushpa )మాత్రమే కాదు ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు.అలాగే రామ్ చరణ్ తో రెండు సినిమాలు తెరకెక్కిస్తున్నారు.వీటితో పాటు అజిత్ తో తమిళ్లో కూడా సినిమాలను తీస్తున్నారు.సన్నీ డియోల్ తో హిందీలో ఒక సినిమా తీస్తున్నారు.మలయాళం నుంచి రెండు సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు.

ఇలా ఇవన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం.దాంతో మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ పొజిషన్లో దూసుకుపోతుంది.

Telugu Allu Arvind, Dil Raju, Geeta, Mythri Makers, Languages, Pratiband, Pushpa

దిల్ రాజు

( Dil Raju )

దిల్ రాజు కూడా ఈ మధ్య ఎక్కువగా ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ తీస్తున్నారు.అలాగే తెలుగు తో పాటు తమిళ్లో కూడా ఆయన ఎంట్రీ చేశారు.2023 సంక్రాంతికి విజయ్ కుమార్ తో వారిసు( Varisu ) వంటి తమిళ బేస్ మూవీ ఇచ్చారు.అవి మాత్రమే కాకుండా హిందీలో జెర్సీ సినిమాను డబ్ చేయడంతో పాటు హిట్ సినిమాలను కూడా విడుదల చేసి ప్యాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా మారిపోయారు.

Telugu Allu Arvind, Dil Raju, Geeta, Mythri Makers, Languages, Pratiband, Pushpa

అల్లు అరవింద్

( Allu Arvind )

అల్లు అరవింద్ నేతృత్వంలో నడుస్తున్న గీత ఆర్ట్స్( Geeta Arts ) కూడా ఇలాగే పలు భాషలలో సొంతంగా సినిమాలు తీశారు.ఇక గీత ఆర్ట్స్ హిందీలో ఇప్పుడు కాదు దాదాపు 30 ఏళ్ల క్రితమే ప్రతిబంద్ సినిమాతో( Pratiband ) మొట్టమొదటిసారి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత అనేక హిందీ సినిమాలకు వారు ప్రొడ్యూసర్ గా ఉన్నారు.ఇప్పుడు హిందీ రామాయణ చిత్రానికి కూడా ఆయన వన్ అఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉండటం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube