తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిలో రామ్ చరణ్ ( Ram Charan ) మొదటి స్థానంలో ఉన్నాడనే చెప్పాలి.ఆయన చేసిన త్రిబుల్ ఆర్ సినిమా గత సంవత్సరం రిలీజ్ అయి సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈయనకి మంచి గుర్తింపు ను తీసుకువచ్చింది.
ఇక ఇప్పుడు శంకర్( Shankar ) డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా( Game Changer ) చేస్తున్నాడు.ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

ఇక నిన్న రామ్ చరణ్ బర్త్ డే జరిగిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ బర్త్ డే సందర్భంగా( occasion of birthday ) ఆయనకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు.రామ్ చరణ్ 10 వ తరగతి చదువుతున్నప్పుడు హాస్టల్ లో తన ఫ్రెండ్ కి రాత్రి కడుపు నొప్పి రావడంతో ఎవరు అతన్ని సరిగా పట్టించుకోకపోతే రామ్ చరణ్ నైట్ ఒక్కడే తనని హాస్పిటల్ లో జాయిన్ చేయించి అతనికి ఎన్ని డబ్బులు అయితే అయ్యాయో అవన్నీ తనే భరించి రాత్రి నుంచి మార్నింగ్ దాకా హాస్పిటల్ లోనే ఉండి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ రాయడానికి హాస్పిటల్ నుంచే డైరెక్ట్ గా సెంటర్ కి వెళ్ళినట్టుగా తన ఫ్రెండ్ తెలియజేశాడు.

రామ్ చరణ్ తన ఫ్రెండ్ ని చాలా రకాలుగా ఆదుకున్నాడని సహాయం పొందిన వ్యక్తి చెప్పడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.ఇక రామ్ చరణ్ చిన్నతనం నుంచి ఇప్పటివరకు చాలామందికి హెల్ప్ చేసిన కూడా ఆయన పెద్దగా పబ్లిసిటీ ఏమీ చేసుకోడు.ఇక వాళ్ళ నాన్న అయిన చిరంజీవి కూడా చాలామంది కి సహాయం చేస్తాడు.
దానికి ఏమాత్రం తగ్గకుండా రామ్ చరణ్ అందరికీ సహాయ సహకారాలు అందిస్తాడు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.








