Anaparthi TDP : తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ నిరసన

తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ క్యాడర్( Anaparthi TDP Cadre ) నిరసనకు దిగారు.నియోజకవర్గ సీటును నల్లమిల్లికి కేటాయించకపోవడంతో కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

 Tdp Protest In Anaparthi Of East Godavari District-TeluguStop.com

ఈ క్రమంలో పార్టీ క్యాడర్ కొంచెం సమయం వేచి ఉండాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి( Nallamilli Ramakrishna Reddy ) విజ్ఞప్తి చేశారు.సీటు వ్యవహారంపై పార్టీ అధిష్టానంతో చర్చించేంత వరకు ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేయొద్దని క్యాడర్ కు విన్నవించారు.

నల్లమిల్లికి సీటు ఇవ్వని పక్షంలో తాము మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని టీడీపీ నేతలు( TDP Leaders ) స్పష్టం చేస్తున్నారు.నల్లమిల్లికి సీటు ఇవ్వకపోతే నియోజకవర్గంలో వైసీపీ( YCP ) గెలుపు ఖాయమని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే అంతిమ నిర్ణయాన్ని నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే కార్యకర్తలు వదిలేశారని తెలుస్తోంది.అయితే పొత్తుల్లో భాగంగా అనపర్తి నియోజకవర్గ సీటును బీజేపీకి( BJP ) కేటాయించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube