ప్రముఖ నటి సురేఖ వాణి( Surekha Vani ) గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో నానుతూనే ఉంటుంది.ఎందుకంటే ఆమె తరచుగా మీడియాకి వార్తలు అందించే పనిలోనే ఉంటారు.
ఒకప్పుడు డాన్సులు చేసి ఇరగదీసే వారు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ పని చేస్తున్నారు.ఏది ఏమైనా సురేఖ వాణి అంటే ఒక సెన్సేషనల్.
ఆమె మాట్లాడితే ఒక ప్రభంజనమే.ఆమె డాన్స్ చేస్తే ఇక సోషల్ మీడియా కి బోలెడంత కంటెంట్.
సరే ఇవన్నీ పక్కన పెడితే సురేఖ వాణిపై చాల రోజుల నుంచి అనేక రూమర్స్ ఉన్నాయి.అసలు ఆమె ఈ మధ్య ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు.
పైగా భర్త కూడా చనిపోయాడు.అయినా కూడా ఎప్పుడు ఫారెన్ ట్రిప్స్ చేస్తుంది.
రేంజ్ రోవర్ కార్ లో ( Range Rover Car ) తిరుగుతుంది.ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటూ సోషల్ మీడియా లో తెగ ఆరాలు తీస్తూ ఉంటారు.

దీనికి సంబంధించి ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు కుండ బద్దలు కొట్టినట్టు సమాధానాలు చెప్పారు.ఇంటర్వ్యూ తీసుకోవడానికి మీరు నా ఇంటికి వచ్చారు కదా.నా ఇంట్లో పెద్దగా ఏముంది.ఒక సోఫా ఒక ఏసీ ఒక ఫ్రిడ్జ్ తప్ప నేను ఎలాంటి లగ్జరీ లైఫ్ గడపడం లేదు.
కేవలం మీరు అలా చూస్తున్నారు అంతే.నా జీవితం చాలా మంది కన్నా చిన్నది జీవితం.
పైగా నాకు సొంత ఇల్లు కూడా లేదు.ప్రస్తుతం నేను ఉంటున్నది అద్దె ఇంట్లోనే( Rental House ) దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు.
నా జీవితం మీరు అనుకున్నంత లగ్జరీగా లేదు అని, నేను తిరుగుతున్న ఈ కారు కూడా సెకండ్ హ్యాండ్ కారు.( Second Hand Car ) ఒకప్పుడు బాగా డబ్బు సంపాదించినప్పుడు బీఎండబ్ల్యూ కారులో తిరిగే దాన్ని.

ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో ఆ కారుని అమ్ముకొని రేంజ్ రోవర్ సెకండ్ హ్యాండ్ కారు ఈఎంఐ లో తీసుకున్నాను.పైగా నా ఖర్చుల కోసం నెల వారి మెయింటనెన్స్ కోసం ఎప్పటి నుంచో వస్తున్న ఒక ప్రాపర్టీ కూడా అమ్ముకోవాల్సి వచ్చింది.ఇవన్నీ ఎవరికి అవసరం లేదు.కనిపిస్తున్న నా డ్రెస్సింగ్ మాత్రమే ముఖ్యం.కానీ మీరు అనుకున్నంత సాధారణ జీవితం అయితే నాది కాదు.నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను.
అది మీరు అర్థం చేసుకుంటే సంతోషం అర్థం చేసుకోలేకపోయినా నాకు ఎలాంటి బాధ లేదు.నన్ను నా కూతురుని మాత్రం మాటలతో వేధించద్దు అంటూ సురేఖ వాణి చాలా గట్టిగా సమాధానం చెప్పారు.







