ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర డీజీపీని బీజేపీ నేత రఘునందన్ రావు( BJP Leader Raghunandan Rao ) కలిశారు.ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్( Phone Tapping ) అంశంపై సమగ్ర విచారణ చేయాలని కోరారు.
గతంలో తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పానన్న రఘునందన్ రావు గతంలో తాను చేసిన ఆరోపణలు ఇప్పుడు నిజం అయ్యాయని తెలిపారు.అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆరే మొదటి ముద్దాయని తీవ్ర ఆరోపణలు చేశారు.
హరీశ్ రావు( Harish Rao ) రెండో ముద్దాయన్న రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్ లో తానే మొదటి బాధితుడినని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే డీజీపీని కలిసి నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కోరానని వెల్లడించారు.







