తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ.( Vijay Devarakonda ) ఆయన చేసిన పెళ్లిచూపులు సినిమాతోనే సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.
ఆ తర్వాత అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమాతో స్టార్ హీరోగా తను మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో వరుసగా స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసే అవకాశాలను అందుకున్నాడు.
అయినప్పటికీ ఆ సినిమాలు ఏవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆయన టైర్ వన్ హీరోగా ఎదగలేకపోయాడు.ఇక దాంతో ఇప్పుడు మీడియం రేంజ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ భారీ సక్సెస్ లను కొట్టలేకపోతున్నాడు.ఇక ఆయన ఇప్పుడు వచ్చే సినిమాలతో సక్సెస్ కొట్టలేకపోతే టైర్ 2 హీరోగానే మిగిలిపోవాల్సి వస్తుందంటూ చాలామంది సినీ విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ఇక ఇదిలా ఉంటే మరో పక్క నుంచి విశ్వక్ సేన్( Vishwak Sen ) లాంటి యంగ్ హీరో కూడా విజయ్ కి పోటీ ఇస్తూ ఎదుగుతున్నాడు.ఇక వీళ్లిద్దరూ ఒకే టైపు అఫ్ సినిమాలను చేస్తూ వస్తున్నారు.నిజానికి విశ్వక్ సేన్ కి ఈ మధ్య క్రేజ్ బాగా పెరిగింది.ఇంకా ఇప్పుడు ఆయన చేస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’( Gangs Of Godavari ) సినిమాతో కనక సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంటే ఆయన మార్కెట్ అమాంతం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక వీళ్ళిద్దరి మధ్య మంచి టఫ్ వార్ నడుస్తుందనే చెప్పాలి.
విజయ్ దేవరకొండ గీతగోవిందం తర్వాత సాలిడ్ సక్సెస్ అయితే కొట్టలేకపోయాడు.ఇక దానివల్లే ఇప్పుడు వరుసగా పరుశురాం డైరెక్షన్ లో చేస్తున్న ఫ్యామిలీ స్టార్( Family Star ) సినిమాతో గాని లేదా గౌతమ్ తిన్ననూరు డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో గాని భారీ బ్లాక్ బస్టర్ హిట్టు కొడితేనే తను ఇండస్ట్రీలో స్టార్ హీరో అవుతాడు.లేకపోతే తన ప్లేస్ ని కూడా ఆక్యుపై చేయడానికి యంగ్ హీరోలు చాలామంది పోటీ పడుతున్నారనే చెప్పాలి…
.