Satyam Surana : లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో యూనియన్ ఎన్నికలు : దుష్ప్రచారంపై గళమెత్తిన భారతీయ విద్యార్ధి

గతేడాది యూకేలోని( UK ) భారతీయ హైకమీషన్ కార్యాలయంపై ఖలిస్తాన్ వేర్పాటువాదుల దాడి సమయంలో త్రివర్ణ పతాకం కోసం వారికి ఎదురుతిరిగి వార్తల్లో నిలిచాడు సత్యం సురానా.( Satyam Surana ) ఈ క్రమంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో (ఎల్ఎస్ఈ)( London School Of Economics ) యూనియన్ ఎన్నికల సందర్భంగా తనను లక్ష్యంగా జరుగుతున్న ద్వేషం, దుష్ప్రచారాలకు వ్యతిరేకంగా గళం విప్పారు.

 Indian Student Alleges Hate Campaign In London-TeluguStop.com

ఓటింగ్ ప్రారంభమవ్వడానికి కొన్ని గంటల ముందు తనకు వ్యతిరేకంగా ఓ ప్లాన్ ప్రకారం ప్రచారం జరుగుతోందని సత్యం ఆరోపించారు.ఎన్నికల నుంచి తనను బహిష్కరించేలా , ఫాసిస్ట్ ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు.

Telugu Bjp, Hate, Indian, London, Londonschool, Lse, Pro Khalistan, Satyam Suran

మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన సత్యం.కొన్ని నెలలు బొంబాయి హైకోర్టులోనూ ప్రాక్టీస్ చేశాడు.ప్రస్తుతం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎల్ఎల్ఎం చదువుతున్నాడు.ఆయన కోర్సు ఈ ఏడాది చివరిలో ముగుస్తుంది.ఫిబ్రవరి , మార్చి ప్రారంభంలో ఎల్ఎస్ఈ ఎన్నికల షెడ్యూల్( LSE Election Schedule ) విడుదలవ్వగా .ప్రధాన కార్యదర్శి పదవికి సత్యం నామినేషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో మార్చి 14 , 15 తేదీలలో తన పోస్టర్లను కొందరు చించివేశారని .దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు.అయినప్పటికీ కొన్ని పోస్టర్లపై తనకు వ్యతిరేకంగా పిచ్చి రాతలు రాశారని సత్యం చెప్పారు.మార్చి 17న మధ్యాహ్నం.ఎల్ఎస్ఈకి చెందిన అన్ని గ్రూపులకు సందేశాలు వచ్చాయని .వాటిలో సత్యం బీజేపీ మద్ధతుదారుడని, అతను ఫాసిస్ట్ మనస్తత్వమున్న వ్యక్తని పేర్కొన్నారు.సత్యం సురానాకు తొలుత విపరీతమైన మద్ధతు లభించినప్పటికీ, ఈ ద్వేషపూరిత ప్రచారం అతని అవకాశాలను దూరం చేసింది .

Telugu Bjp, Hate, Indian, London, Londonschool, Lse, Pro Khalistan, Satyam Suran

తన ఎక్స్ ఖాతాలో సత్యం .కేవలం బీజేపీ ప్రభుత్వాన్ని( BJP Government ) ప్రశంసించాడు.అయితే అతని పోస్టుల ద్వారా తనపై ఫాసిస్ట్ ముద్ర వేసేందుకు ఉపయోగించారు.

తాను సొంతంగా రాసుకున్న మేనిఫెస్టోలో ఎలాంటి రాజకీయ పరమైన అంశాలు లేవని సత్యం చెప్పాడు.ఎల్ఎస్ఈలో పరిస్ధితులను ఎలా మెరుగుపరచాలి, ఫిర్యాదుల పరిష్కార పోర్టల్ అవసరం ఎలా వుంది.

క్యాంపస్‌లో సబ్సిడీ ఆహారాన్ని కలిగి వుండటం వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాదులను ప్రతిఘటించినందుకు తనను లక్ష్యంగా చేసుకున్నారని సత్యం ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube