Election Code Violation : వరంగల్ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన

వరంగల్ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన( Election Code Violation ) కొనసాగుతోంది.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ పార్టీల ప్రభలకు పోలీస్ ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారని తెలుస్తోంది.

 Violation Of Election Code In Warangal District-TeluguStop.com

రాజకీయ పార్టీలకు చెందిన ప్రభలతో నర్సంపేట – వరంగల్( Narsampet-Warangal ) ప్రధాన రహదారిపై దాదాపు ఐదు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కాగా కాంగ్రెస్ పార్టీ9 Congress Party )కి చెందిన ప్రభలకు అధికార పార్టీ నేతలు స్వాగతం పలికారు.ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరామ్ నాయక్( Balaram Naik ), ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్( BRS ) ప్రభలను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.అయితే కోడ్ ఉల్లంఘన, ట్రాఫిక్ నియంత్రణపై పోలీస్ యంత్రాంగం చేతులెత్తేసిందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube