అలనాటి రంగస్థల, సినీ కథానాయిక షావుకారు జానకి( Sowcar Janaki ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో సినీ ప్రేక్షకుల హృదయాలను దోచేసింది.
తన సుదీర్ఘమైన కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలిపి మొత్తంగా 390కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసి మెప్పించింది.అద్భుతమైన నటనతో నంది అవార్డులను కూడా గెలుచుకుంది.
పద్మశ్రీ పురస్కారాన్ని( Padma Shri ) కూడా అందుకుంది.ప్రస్తుతం ఆమె వయసు 92 ఏళ్ళు.
ఈ వయసులో కూడా ఆమె అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సినిమాల్లోకి రావడం వల్ల తాను ఎదుర్కొన్న అవమానాలను, కష్టాలను షేర్ చేసుకుంది.
ఆ ఇంటర్వ్యూలో కమెడియన్ అలీ( Comedian Ali ) నాగేశ్వరావు, ఎన్టీఆర్ లను ముట్టుకోవడం వల్ల మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదంట కదా అని ప్రశ్నించాడు.అయితే ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.“వారిని ముట్టుకున్నందుకు కాదు, సినిమాల్లో వేషాలు వేయడం వల్ల బంధువులు నన్ను ఇంట్లోకి రానివ్వలేదు. సినిమాల్లో వేషాలు( Movies ) వేయడం వల్ల హీరోలకు దగ్గరగా వెళ్లాల్సి వచ్చేది.
వారితో మంగళసూత్రం కూడా కట్టించుకోవాల్సిన సన్నివేశాలు ఉండేవి.పెళ్లి సీన్లతో పాటు ఫస్ట్ నైట్ సీన్లు( First night Scenes ), హాట్ సాంగ్స్ లో కూడా నటించాను.
అవన్నీ కూడా మా కుటుంబ సభ్యులు, బంధువులు అప్రిషియేట్ చేసేవారు కాదు.మా పిన్ని, అంకుల్స్ ఎవరూ కూడా నన్ను వాళ్ళ ఇంట్లోకి రానివ్వలేదు.” అని షావుకారి జానకి చెప్పుకొచ్చింది.
ఎప్పుడైనా వారి ఇంటికి వెళ్తే.“వద్దమ్మా, అంకుల్ రానివ్వద్దని అన్నాడు.నువ్వు ఇంకా ఎక్కడికైనా వెళ్ళు” అని పంపించిన సందర్భాలు కూడా ఉన్నట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.“అప్పట్లో సినిమాల్లో చేసే నటీనటులకు కొత్త ఇల్లు దొరకడం చాలా కష్టంగా ఉండేది, అందువల్ల చుట్టాల ఇంటికి వెళ్దామంటే వాళ్లు గడప కూడా తొక్కనిచ్చేవారు కాదు.అప్పట్లో మన సినీ కళాకారులు( Artists ) పడిన బాధలు అన్నీ కావు.ఇప్పుడంటే సినిమాల్లో ఉన్న వారిని చుట్టాలు బతిమిలాడి మరీ తమ ఇళ్లలో పెట్టుకుంటున్నారు.” అని జానకి చెప్పుకొచ్చింది.సినిమా వాళ్ళు గొప్ప వాళ్ళమని ఎప్పుడూ భావించారని ఇంకా ఏదో సాధించాలనే తపనతోనే ఉంటారని కూడా ఆమె తెలిపింది.ఇన్ని కష్టాలను షావుకారు జానకి సినిమాలను వదిలేయలేదు.
అందుకే ఆమెను ప్రేక్షకులు( Audience ) బాగా పొగుడుతున్నారు.