పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ పూర్తి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎన్.

 The Polling Staff Completed The First Randomization, Polling Staff Randomization-TeluguStop.com

ఐ .సి.వి.సి.హాల్ లో సంబంధిత అధికారులతో కలిసి ఎన్.ఐ .సి వారు రూపోందించిన సాఫ్ట్ వేర్ వినియోగిస్తూ ఆన్లైన్లో పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి మాట్లాడుతూ

జిల్లాలో సిరిసిల్ల , వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 560 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 674 ప్రిసైడింగ్ అధికారి,674 సహాయక ప్రిసిడింగ్ అధికారి,1348 ఓపిఓలు మొత్తం 2696 లను కేటాయించడం జరుగుతుందని అన్నారు.

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం 20% అదనంగా సిబ్బంది కేటాయింపు ప్రక్రియ చేపట్టామని తెలిపారు.ఈ సమావేశంలో సి.పి.ఓ శ్రీనివాస చారి ,డి.ఈ.ఓ ఈ.డి.ఎం శ్రీనివాస్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube