తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోలలో చిరంజీవి,( Chiranjeevi ) వెంకటేష్( Venkatesh ) లాంటి స్టార్ హీరోలు మొదటి వరుసలో ఉన్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్లు సాధించిన విజయాలు గాని వీళ్లు పొందిన స్టార్ స్టేటస్ ని గాని ఎవరూ కూడా పొందలేదనే చెప్పాలి.
నిజానికి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ,బాలకృష్ణ లాంటి హీరోలు టైర్ వన్ హీరోలుగా చాలా సంవత్సరాల పాటు కొనసాగుతూ వస్తున్నారు.
వీళ్ళు ఏ సినిమాలు చేసిన కూడా ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ అయితే వచ్చేది.
ఇక అందులో భాగంగానే ఒకరు ఒక రకమైన సినిమా చేస్తే, మరొక హీరో కూడా అలాంటి సినిమాలే చేసేవారు.ఇక అందులో భాగంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన జయంత్ సి పరంజి( Jayanth C Paranjee ) చిరంజీవి, వెంకటేష్ లకు తలా రెండు హిట్లను ఇచ్చాడు.
వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా అనే రెండు సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు.ఇక చిరంజీవితో కూడా శంకర్ దాదా ఎంబిబిఎస్, సినిమాలు చేసి సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.ఇక ఇలాంటి క్రమం లోనే నాగార్జునకి( Nagarjuna ) మాత్రం ఒక భారీ ఫ్లాప్ ని ఇచ్చాడనే చెప్పాలి.నాగార్జున హీరోగా అంజలి జవేరి హీరోయిన్ గా వచ్చిన రావోయి చందమామ సినిమా( Ravoyi Chandamama ) జయంత్ సి పరంజి దర్శకత్వంలో తెరకెక్కింది.
అయితే ఈ సినిమా మాత్రం అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది దానివల్లే ఈ సినిమా అనేది భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది…ఇక చిరంజీవి వెంకటేష్ లకి భారీ సక్సెస్ లను అందించిన ఈ స్టార్ డైరెక్టర్ నాగార్జున కి మాత్రం భారీ ప్లాప్ లను ఇచ్చాడని చెప్పాలి…
.