కృషి, పట్టుదల, ప్రతిభ వంటి లక్షణాలతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా ఎదిగాడు రజనీకాంత్.( Rajinikanth ) ఒక్క కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా భారతదేశం, జపాన్ వంటి దేశాల్లో కూడా తనకంటూ ఒక సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సృష్టించుకున్నాడు.
ఈ హీరో తమిళంలో ఎంత మంది అభిమానులను సంపాదించుకున్నాడో తెలుగులో కూడా అదే స్థాయిలో అభిమానులను ఎర్న్ చేశాడు.
రజనీకాంత్ స్మాల్ క్యారెక్టర్లతో కెరీర్ ప్రారంభించాడు.
అలా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఒక ప్రొడ్యూసర్ ( Producer ) రజనీకాంత్‌ను సంప్రదించాడు.ఒక క్యారెక్టర్ చేయాలని, రూ.6 వేల ఇస్తానని అతడు రజనీకాంత్ కి తెలియజేశాడు.అప్పట్లో ఆ అమౌంట్ తనకు ఎక్కువే కావడంతో రజనీ ఆ క్యారెక్టర్ చేస్తానని చెప్పాడు.
అలానే డబ్బు అవసరం పడి అడ్వాన్స్‌గా 1000 రూపాయలు ఇవ్వాలని కోరాడు.అయితే షూటింగ్ స్పాట్ కి వచ్చాక రూ.1,000 ఇస్తానని సదరు నిర్మాత మాట ఇచ్చి రజనీకాంత్ ను పంపించేశాడు.

మరుసటి రోజు రజనీకాంత్ షూటింగ్ స్పాట్‌కి వెళ్లి క్యారెక్టర్‌కి తగినట్లు మేకప్ వేసుకున్నాడు.అనంతరం మేనేజర్ ని పిలిచి 1000 రూపాయలు అడ్వాన్స్‌గా ఇప్పిస్తారా అని అడిగాడు.అప్పుడే అక్కడికి నిర్మాత వచ్చాడట.
వెయ్యి రూపాయలు అడుగుతున్నాడని తెలుసుకొని “నువ్వేదో మూడు నాలుగు సినిమాలు చేసేసినట్లు ఓవరాక్షన్ చేస్తున్నావు, అప్పుడే నీకెందుకు అడ్వాన్స్ ఇవ్వాలి, అసలు ఈ సినిమాలో నీకు ఏ క్యారెక్టర్ లేదు, నువ్వు వెళ్ళిపో” అని ఆ నిర్మాత చాలా దురుసుగా రజనీకాంత్ ని తిట్టాడట.దాంతో ఎంతో అవమానంగా ఫీల్ అయిన రజనీకాంత్ తనను ఇంట్లో డ్రాప్ చేయడానికి కారు పంపించాలని అడిగాడట.
నీ ముఖానికి కారు( Car ) కూడా కావాలా? నడుచుకుంటూ వెళ్లిపో అని సదరు నిర్మాత మరోసారి కోపం తెప్పించాడట.

అప్పుడు రజనీకి చాలా గొప్పతనాన్ని కోపం వచ్చి తను కూడా ఎదురు తిరిగి మాట్లాడాడట.ఈ ఏవియం స్టూడియోలో( AVM Studio ) అవమానించావు కదా, మళ్లీ ఇదే ఏవియం స్టూడియోకి నేను కారు వస్తా, నీ చేతనే దండాలు పెట్టించుకుంటా, అలా చేయకపోతే నా పేరు ‘రజనీకాంత్‘ కాదు అని ఛాలెంజ్ చేశాడు.ఆ ఛాలెంజ్ చేసినట్లే రజినీకాంత్ రెండేళ్లలోనే ఏవియం స్టూడియోకి కారులో వచ్చాడట.
అంతేకాకుండా అక్కడ కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని సిగరెట్ తాగుతూ సదరు ప్రొడ్యూసర్ ముందు తనదైన స్టైల్ చూపించాడట.అలా రజనీకాంత్ ఆ నిర్మాత ముఖం చిన్నబోయేలా రివేంజ్ తీర్చుకున్నాడని తెలిసింది.







