రంగుల కేళీ.హోలీ పండుగను( Holi Festival ) భారతీయులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే ఈ పర్వదినానికి సంబంధించి పలు పౌరాణిక గాథలు ప్రచారంలో వున్నాయి.పూర్వం హిరణ్య కశ్యపుడి కుమారుడు ప్రహ్లాదుడు పరమ విష్ణుభక్తుడు.
తన బిడ్డ శ్రీమహా విష్ణువును( Sri Maha Vishnu ) పూజించకుండా మాన్పించేందుకు ఆయన చిత్రహింసలకు గురిచేస్తాడు.ఏం చేసినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి తన సోదరి హోలిక( Holika ) అనే రాక్షసిని చితిలో కూర్చోమని చెప్పి ఆమె ఒళ్లో ప్రహ్లాదుణ్ణి కూర్చోమంటాడు.
మంటల నుంచి రక్షించే శాలువాను ధరించడం వల్ల ఆమెకు ఏ ప్రమాదం జరగదు.
ఇదే సమయంలో ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ప్రార్ధించడంతో ఆయన మహిమ వల్ల మంటల నుంచి బయటపడతాడు.
కానీ శాలువా ఎగిరిపోవడంతో హోలిక దహనమైపోతుంది.దీనికి గుర్తుగా ప్రజలు హోలీని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఈరోజున హోలిక పేరుతో ఓ బొమ్మను తయారు చేసి దానికి నిప్పంటించి వేడుక నిర్వహిస్తారు.అలాగే రతిదేవి ప్రార్థన మేరకు మన్మథుడిని పరమేశ్వరుడు బతికించిన రోజు కావడంతో కొన్ని చోట్ల కాముని పున్నమిగా జరుపుకుంటారు.
దీనితో పాటు శ్రీకృష్ణుడు( Sri Krishna ) బృందావనంలో గోపికలతో కలిసి పువ్వులు , రంగులు చల్లుకుంటూ వసంతోత్సవం నిర్వహించుకున్నాడట.సిరుల తల్లి శ్రీమహాలక్ష్మీ క్షీరసాగరం నుంచి ఆవిర్భవించింది ఈరోజే కావడంతో ఆమెను భక్తులు ఆరాధిస్తారు.
కాగా.భారత్‌తో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో హోలీని జరుపుకున్నారు.దీనిలో భాగంగా అమెరికాలోని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ (ఏఎస్‌యూ)లోని( Arizona State University ) ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐఎస్ఏ) హోలీని నిర్వహించింది.వివిధ సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన దాదాపు 2000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారని ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు.
టెంపే ఎస్‌డీఎఫ్‌సీకి ఉత్తరాన వున్న గడ్డి మైదానంలో వేడుకలు నిర్వహించారు.భారత్‌లో హోలీ వేడుకలు వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తాయని గ్లోబల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న గ్రాడ్యుయేట్ విద్యార్ధి అవిరల్ జైన్ అన్నారు.
భారతదేశంలో మనం జరుపుకునే అతిపెద్ద పండుగ హోలీ అని ఆయన తెలిపాడు.
హోలీ ఏఎస్‌యూలో సాంస్కృతికి మార్పిడిని సూచిస్తుందని .తాను స్నేహితులతో ఆడటం లేదని, అపరిచితులతో ఆడుతున్నానని దీని వల్ల బంధాలను అభివృద్ధి చేసుకోవచ్చునని జైన్ పేర్కొన్నాడు.ఏఎస్‌యూలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్ధుల్లో 6400 మంది భారత్ నుంచి వచ్చినట్లు వర్సిటీ అధికారులు ధృవీకరించారు.
ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యుడు , మాలిక్యులర్ బయోసైన్స్ , బయో టెక్నాలజీ చదువుతున్న అరిన్ షా మాట్లాడుతూ.భారతీయ విద్యార్ధుల జనాభా ఎక్కువగా వున్నందునే ఐఎస్ఏలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.