సూర్యాపేట జిల్లా:జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు( Mattipally Saidus ) ఒక ప్రకటనలో ఆరోపించారు.గ్రామీణ ప్రాంతంలో త్రాగునీరు లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతూ మైళ్ళ దూరం మంచినీళ్ల కోసం పోతున్నా అధికారులు,ప్రజా ప్రతినిధులు పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయితీ పాలకవర్గం పదవి విరమణ చేసిన తర్వాత నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పజెప్పిందని,గ్రామాల్లో ప్రతిరోజు అందుబాటులో ఉంటూ ప్రజల తాగునీటి కష్టాలను పట్టించుకోవల్సిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు,ప్రత్యేక అధికారులు సక్రమంగా విధులకు హజరు కావడం లేదని,దీని మూలంగా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడుతుందన్నారు.
తాగునీటి సమస్య( Drinking water problem ) తీవ్రంగా ఉన్న గ్రామాలలో అద్దె బోర్లా ద్వారా నీటిని తీసుకొని ప్రజలకు తాగునీరు ఇబ్బంది కాకుండా చూడాల్సిన అధికారులు,తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.తాగునీటి సమస్య ప్రధానంగా గీగిరిజన తండాలు,ఎస్సీ కాలనీలో నీటి కొరత తీవ్రంగా ఉందన్నారు.నాగార్జునసాగర్ ఎడమ కాలువ,ఎస్సారెస్పీద్వారా నీటిని విడుదల చేసి త్రాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
జలాశయాలలో నీరు ఎండిపోవడం మూలంగా భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి సమస్య జటిలంగా మారిందన్నారు.అనేక గ్రామాలలో కాలిపోయిన మోటార్లులను త్వరతగతిన అధికారులు రిపేర్ చెయ్యకపోవడంతో అనేక గ్రామాలలో తాగునీటికి కష్టాలు ఏర్పడ్డాయన్నారు.
తక్షణమే జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.
తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!