Wolf Attack Girl : రెండేళ్ల పాపపై దాడి చేసిన తోడేలు.. షాకింగ్ వీడియో వైరల్‌..

మనుషులు అభివృద్ధి పేరిట అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు.జనాలు పెరుగుతున్న కొద్దీ అడవులను ఆక్రమించుకోవడం కూడా ఎక్కువ అవుతోంది.

 Wolf Attack Two Year Old Girl Video Viral-TeluguStop.com

ఫలితంగా వన్య ప్రాణాలు( Forest Animals ) ఆవాసాలు కోల్పోతున్నాయి.అవి తలదాచుకోవడానికి చాలా ఇక్కట్లు పడుతున్నాయి.

ఆహారం లభించక చివరికి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.ఇలాంటి సందర్భాలలో అవి ప్రజలకు హాని చేస్తున్నాయి.

లేదంటే అవే ప్రమాదాల్లో పడుతున్నాయి.తాజా ఘటనలో ఒక చిన్న పాపపై తోడేలు దాడి( Wolf Attack ) చేసింది.

ఆ చిన్నారిని చంపేసి తినేద్దామని చూసింది కానీ తండ్రి త్వరగా స్పందించి ఆమెను కాపాడాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Brave, Save, Latest, Animals, Wolf Attack-Latest News - Telugu

పాపులర్ ట్విట్టర్ అకౌంట్ @crazyclipsonly ఈ క్లిప్‌ను పంచుకుంది.ఈ వీడియోలో ఒక వ్యక్తి కారును( Car ) ఇంటి ముందు పార్క్ చేయడం మనం చూడవచ్చు.పార్క్ చేసిన తర్వాత కారు డోర్ తెరిచి కారులోని సరుకులను ఇంట్లోకి తీసుకెళ్లడం ప్రారంభిస్తాడు.మరోవైపు ఆ వ్యక్తి రెండేళ్ల పాప( 2 Year Old Girl ) కూడా కారు దిగుతుంది.

అనంతరం ఇంటి లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది.ఇంతలోనే అక్కడికి ఒక తోడేలు వచ్చింది.

అది పాపను గమనించి ఆహారం దొరికేసింది అని సంతోషించింది.వెంటనే అది పాపపై పడిపోయి నోటితో పట్టుకుని లాకెళ్లడానికి యత్నించింది.

ఒకేసారి తోడేలు మీద పడటంతో చిన్నారి బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించింది.దాంతో చిన్నారికి ఏం ప్రమాదం వచ్చిందో అని కంగారుపడుతూ తండ్రి వెంటనే వెనక్కి చూశాడు.

Telugu Brave, Save, Latest, Animals, Wolf Attack-Latest News - Telugu

అప్పుడు తోడేలు చిన్నారిపై పడి దాడి చేయడం చూసి షాక్ అయ్యాడు.వెంటనే కూతురి వైపు పరిగెత్తి తోడేలు పై దాడి చేశాడు.దాని నుంచి చిన్నారిని రక్షించాడు.ఆ సమయంలో తోడేలు అతడిపై కూడా దాడి చేసింది.తండ్రి భయపడకుండా ఒక కర్ర తీసుకొని ఆ తోడేలను భయపెట్టి అక్కడి నుంచి తరిమేశాడు.ఈ వీడియో చూసి చాలామంది షాక్ అవుతున్నారు.

తండ్రి చూడకపోతే పరిస్థితి చాలా బాధాకరంగా ఉండేదని కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియోకి పాతిక లక్షల దాక వ్యూస్ వచ్చాయి, 5 వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి.

చాలామంది తండ్రి స్పందించిన తీరును ప్రశంసించారు.ఈ తోడేలు ఇతరులపై దాడి చేయకముందే దానిని సురక్షితమైన ప్రదేశానికి తరలించడం మంచిది అని మరికొందరు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube