తాజాగా ట్విట్టర్ లో టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ అలాగే మహేంద్ర గ్రూప్ ఆఫ్ యజమాని ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) మధ్య సరదాగా సంభాషణ జరిగింది.వారిద్దరి మధ్య కన్వర్జేషన్ చూసిన అభిమానులు ముచ్చట పడుతున్నారు.
ఇంతకీ వారిద్దరూ ఏం చాట్ చేసుకున్నారు అన్న విషయానికి వస్తే.సుజీత్ పెళ్లికి నన్ను ఎందుకు ఆహ్వానించలేదు అని చరణ్ ప్రశ్నించగా.
గందరగోళంలో పడి మర్చిపోయా అని మహీంద్రా రిప్లై ఇచ్చారు.అలా వీరిద్దరి మధ్య సరదాగా ఈ సంభాషణ కొనసాగింది.
2040 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారడమే మహీంద్రా లక్ష్యమని పేర్కొంటూ ఆ సంస్థ తాజాగా ఒక వాణిజ్య ప్రకటన( commercial advertisement ) విడుదల చేసింది.కొన్నేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్‌లో మహీంద్రా ప్యాక్టరీ నిర్మించడమే కాకుండా లక్షలాది చెట్లు కూడా నాటారని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా నిర్మించారని ఆ వీడియోలో పేర్కొన్నారు.దాని వల్ల అండర్‌గ్రౌండ్ వాటర్ లెవల్ 400 అడుగులు పెరిగిందని నీటి ఎద్దడి కారణంగా బ్రహ్మచారిగా ఉన్న సుజీత్‌కు( Sujeet ) పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలిపారు.
దీనిపై రామ్‌చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు.ఈ వీడియో షేర్ చేస్తూ.ఆనంద్ మహీంద్రా.
సుజీత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదు? జహీరాబాద్ దగ్గర్లోనే నేను ఉండేది.ఆ ప్రాంతంలో నా స్నేహితులను సరదాగా కలిసేవాడిని.
ఏది ఏమైనా ఇది గ్రేట్ వర్క్ అని పోస్ట్ పెట్టారు.దీనిపై మహీంద్రా స్పందింస్తు.
నేను అంగీకరిస్తున్నా.గందర గోళానికి గురయ్యా.
నీకు ఆహ్వానం పంపించడం మర్చిపోయా చరణ్.మీ శిక్షణ ఆధారంగా నా డ్యాన్స్‌ను మెరుగుపరుచుకునే పనిలో నిమగ్నమయ్యా.
మా ప్రకటన పట్ల స్పందించి ప్రశంసలు కురిపించినందుకు ధన్యవాదాలు.ఇదెంతో సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నా.
నేను మరోసారి మిస్ కావాలని అనుకోవడం లేదు.అందుకే ఇప్పుడే చెబుతున్నా.
హ్యాపీ బర్త్‌డే ఇన్ అడ్వాన్స్‌అని రిప్లై ఇచ్చారు.