టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ఆయన భార్య వితికా షేరు( Vithika Sheru ) గురించి మనందరికీ తెలిసిందే.వీరిద్దరూ పడ్డారని ప్రేమలో మరి సినిమాలో జంటగా నటించారు.
ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ప్రేమించుకున్న ఈ జెంట పెద్దలను ఒప్పించి మరి 2016లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.ఇక అప్పటి నుంచి వితికా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ వరుణ్ మాత్రం పలు చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్‌ను పెంచుకుంటున్నాడు.
అయితే ఈ క్యూట్ కపుల్ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-3 ( Bigg Boss Season-3 )షోకు కంటెస్టెంట్స్‌కు పాల్గొన్నారు.
ఈ ఇద్దరు పలు టాస్క్ ల్లో చురుకుగా పాల్గొన్నప్పటికీ చివరి వరకు రాలేకపోయారు.ఈ నేపథ్యంలోనే వితికా బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న తీరుపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు.దీంతో ఆమె కొంత కాలం డిప్రెషన్‌కు వెళ్లిపోవడంతో వరుణ్( Varun ) ఆమె వెన్నంటే ఉండి మళ్లీ వితికా నార్మల్ అయ్యేలా చేశాడు.
ఇటీవల కాలంలో సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ( YouTube channel )ని మొదలుపెట్టిన వితికా వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.
ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే హీరోగా పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే వితికా షెరును జనాలు నిత్యం పిల్లలను ఎప్పుడు కంటారు? పెళ్లై ఎనిమిదేళ్లు అవుతుంది.పిల్లలను కనాలనే ఆలోచన లేదా? అని అడుగుతున్నారు.గతంలో చాలా ఇంటర్వ్యూలలో కూడా ఇదే ప్రశ్న వారికి ఎదురైంది.
దీంతో ఎప్పటికప్పుడు ఆ విషయం గురించి దాటవేస్తూ వచ్చిన వితికా వరుణ్ తేజ్ లు తాజాగా ఈ విషయంపై స్పందించారు.కాగా ఆ ప్రశ్నల పై విసిగిపోయిన వితికా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక షాకింగ్ వీడియోను షేర్ చేసింది.
పిల్లల్ని ఎప్పుడు కంటారు అని జనాలు నన్ను పదే పదే అడుగుతున్నారు కదా.ఇది నా రెస్పాన్స్.ఇదిగో ఈ పిల్లవాడు పెద్దయ్యాక కంటాను అని చెప్పుకొచ్చింది.ఇందులో వితికా భర్త వరుణ్ కలిసి కారులో ఎక్కడికో వెళ్తుండగా.వరుణ్-వితికా ఒడిలో పడుకుని ఉంటాడు.భర్తనే తన పిల్లాడని అతను పెద్దయ్యాక బిడ్డను కంటానని అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది.
దీంతో ఈ పోస్టును చూసిన వారంతా సూపర్ సమాధానం ఇచ్చారని వితికాను పొగుడుతున్నారు.