టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
కాగా బాలయ్య బాబు చివరగా భగవంత్ కేసరి సినిమాతో( Bhagwanth Kesari ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
దాంతో ఇప్పుడు అదే ఊపుతో బాలయ్య బాబు వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడపడంతో పాటు ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.ఇది ఇలా ఉంటే బాలయ్య బాబు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆ సంగతి పక్కన పెడితే బాలయ్య బాబుకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.ఆయన పేరు ఒక స్లోగన్.ఇది వినగానే అభిమానుల్లో పూనకాలు టన్నుల కొద్దీ బయటకు తన్నుకుని వస్తుంది.సమయం సందర్భం లేకుండా కూడా అభిమానులు ఆయన పేరు విచ్చలవిడిగా వాడేస్తుంటారు.అయితే ఆయన క్రేజ్ ఇక్కడ మాత్రమే కాదు బాలీవుడ్‌లోనూ భారీగా ఉందన్న సంగతి మీకు తెలుసా? తాజాగా అందుకు సంబంధించిన ఒక ఉదాహరణ వెలుగులోకి వచ్చింది.తెలుగు చలన చిత్ర పరిశ్రమ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ( Movie Artists Association )ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈ విషయాన్ని తెలిపారు.ఈ వేడుకల ద్వారా ఫండ్ రైజ్ చేసి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మా సభ్యులను ఆదుకుంటామని తెలిపారు.

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన మా ప్రెస్ మీట్లో దీన్ని పేర్కొన్నారు.నవతి( Navati ) పేరుతో మలేషియాలో( Malaysia ) ఈ ఈవెంట్‌ను భారీగా నిర్వహించనున్నట్లు చెప్పుకొచ్చారు.ఈ ఈవెంట్ మలేషియాలో నిర్వహిస్తాం.ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి తేదీని అనౌన్స్ చేస్తాం.తెలుగు చిత్ర పరిశ్రమకు స్వర్ణయుగం నడుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం గొప్ప విషయం.
మొదటి తెలుగు యాక్టర్ఈ అవార్డును అందుకోవడం.గర్వించదగ్గ విషయం.
ఇక్కడే కాదు బాంబేలోనూ ఏదైనా పార్టీస్, ఈవెంట్లు, పబ్స్‌కు వెళ్లితే అక్కడ లాస్ట్ సాంగ్ కచ్చితంగా బాలయ్య పాటే ఉంటుంది. జై బాలయ్యతోనే అవి ముగుస్తాయి.
నా బ్రదర్ అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు వచ్చింది.చిన్న విషయం కాదు.
కేరళలో అతనికి అక్కడి వారితో సమానంగా క్రేజ్ ఉంటుంది.నా డార్లింగ్ బ్రదర్ ప్రభాస్ హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్ అయ్యాడు.
ఆయన సినిమా కోసం అందరూ ఎదురుచూస్తుంటారు.పెద్ద సినిమా వస్తుందని భావిస్తారు.
అందుకు కారణం అతడికున్న హుమిలిటీ.మిత్రుడు మహేశ్ – రాజమౌళి సినిమా ఆసియాలోనే హెయెస్ట్ బడ్జెట్ మూవీ కాబోతోంది.
రాజమౌళి తెలుగు చిత్రసీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంచారు.కీరవాణి ఆస్కార్‌ను అందకున్నారు.
అలా అన్నీ చోట్ల తెలుగు ఉంది.ప్రస్తుతం మేం చేయబోతున్న ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్చేయాలని, అందుకు మీడియా మిత్రుల సహకారం కావాలని కోరుతున్నాను అని మంచు విష్ణు తెలిపారు.
అయితే ఈ కామెంట్స్‌లో బాలయ్య బాబు క్రేజ్ గురించి హైలైట్ అయింది.ఇది ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
అది బాలయ్య క్రేజ్ అంటే మాములుగా ఉండదు మరి అని చెబుతున్నారు.







