తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వరుస సినిమాలు చేయడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక వరుస సినిమాలను చేస్తూ భారీ సక్సెస్ లను కొడుతున్నారు.
ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మార్కెట్ కూడా భారీగా పెరిగింది.కాబట్టి వాళ్ళు తీసుకునే రెమ్యూనరేషన్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇక అందులో భాగంగానే మన స్టార్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు.ప్రస్తుతం ఈయన దాదాపు 100 నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ఈయన ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు…
మహేష్ బాబు
ఒక్క సినిమా కోసం దాదాపు 70 నుంచి 100 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ప్రస్తుతం రాజమౌళి ( Rajamouli )చేసే సినిమాతో కూడా అంతే మొత్తంలో బడ్జెట్ ని తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…
ప్రభాస్
ప్రభాస్( Prabhas) ఒక్క సినిమా కోసం దాదాపు 150 నుంచి 200 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఈయన బాహుబలి సిరీస్,సాహో, సలార్ సినిమా( Salaar) సూపర్ సక్సెస్ లు కొట్టడంతో వీళ్ల రెమ్యూనరేషన్ భారీగా పెరిగిందనే చెప్పాలి…
రామ్ చరణ్
ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక మైన గుర్తింపును తెచ్చుకున్న హీరో రామ్ చరణ్( Ram Charan)…ప్రస్తుతం ఈయన వంద నుంచి 120 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది…
జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా కోసం 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం దేవర సినిమాతో ఈయన స్టార్ హీరోగా మారాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
అల్లు అర్జున్అల్లు అర్జున్( Allu Arjun ) ఒక సినిమా కోసం దాదాపు 60 కోట్ల నుంచి 100 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకు అంటే నేను పుష్ప సినిమా పాన్ ఇండియా లో సూపర్ సక్సెస్ అవడంతో ఆయన భారీ గా రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది…
.