పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) రామ్ చరణ్ లకు( Ram Charan ) సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటు హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నారు.హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందని చాలామంది భావించినా ఈ సినిమా ఆగిపోలేదని నిర్మాత క్లారిటీ ఇచ్చారు.
హరిహర వీరమల్లు మూవీ( Hari Hara Veeramallu ) డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం కావడంతో ఈ సినిమా రిలీజ్ ఆగిపోలేదని క్లారిటీ వచ్చింది.చరణ్ విషయానికి వస్తే గేమ్ ఛేంజర్ సినిమాతో( Game Changer Movie ) బిజీగా ఉన్న రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు సినిమాతో బిజీ కానున్నారు.
మెగా హీరోల సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.మెగా హీరోల రెమ్యునరేషన్లు సైతం భారీ రేంజ్ లో ఉన్నాయి.
ఒక అభిమాని మెగా హీరోలపై అభిమానం చాటుకున్నారు.పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఫోటోలతో శుభలేఖను( Wedding Card ) అభిమాని సిద్ధం చేయడం గమనార్హం.వెస్ట్ గోదావరి జిల్లాలోని అత్తిలికి చెందిన ఉమా మహేశ్వర అయ్యప్పకు( Uma Maheshwara Ayyappa ) అనూష దుర్గ( Anusha Durga ) అనే యువతితో మ్యారేజ్ ఫిక్స్ అయింది.ఈ నెల 27వ తేదీన అయ్యప్ప పెళ్లి జరగనుంది.
అయ్యప్ప పవన్, చరణ్ పై చూపించిన అభిమానానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
పవన్, రామ్ చరణ్ తన టాలెంట్ తో వీరాభిమానులను సంపాదించుకున్నారు.పవన్, రామ్ చరణ్ ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెంచుకుంటున్నారు.పవన్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఫ్యాన్స్ సినిమా కోరుకుంటుండగా రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.
ఈ కాంబినేషన్ కోసం చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.