మనం చేసే ప్రతి పనిలో ఎంతో కష్టం ఉంటుంది.అయితే కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే సులువుగా సక్సెస్ సొంతమవుతుందని చెప్పవచ్చు.
నల్గొండ జిల్లాకు( Nalgonda District ) చెందిన లింగుస్వామి( Linguswamy ) ఒకప్పుడు పేపర్ బాయ్ గా పని చేశాడు.పాలు అమ్మి కెరీర్ ను కొనసాగించాడు.
అయితే ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తన సక్సెస్ తో ప్రశంసలు అందుకున్నాడు.తన సక్సెస్ గురించి లింగుస్వామి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పేదింటి విద్యాకుసుమం లింగుస్వామి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కెరీర్ పరంగా వెనుకడుగు వేయలేదు.ఉద్యోగం సాధిస్తే మాత్రమే తన కుటుంబ పరిస్థితి మారుతుందని లింగుస్వామి భావించారు.తాజాగా వెలువడిన గురుకుల ఫలితాలలో ఏకంగా మూడు ఉద్యోగాలు సాధించాడు.ఇతని తల్లీదండ్రులు ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
లింగుస్వామి తండ్రికి ట్రాక్టర్ ప్రమాదంలో గాయం కావడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు.

ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు పొలం పనులు చేసేవాడు.చిన్నచిన్న ఖర్చులను అధిగమించడానికి పేపర్ బాయ్ గా( Paper Boy ) పని చేయడంతో పాటు పాలు విక్రయించేవాడు.కాలేజ్ కు వెళ్లి వచ్చిన తర్వాత కూడా పొలం పనులు చేసేవాడినని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగులో( M.A Telugu ) లింగుస్వామి టాపర్ గా నిలిచారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చదువును వదల్లేదని ఆయన అన్నారు.

జేఎల్ ఉద్యోగం( JL Job ) సాధించాలని నేను అనుకుంటున్నానని లింగుస్వామి తెలిపారు.నేను పిల్లలకు ట్యూషన్స్ చెప్పేవాడినని స్పోర్ట్స్ పై కూడా నాకు ఆసక్తి ఉండేదని లింగుస్వామి వెల్లడించారు.సాహిత్యం అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన అన్నారు లింగుస్వామి సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.లింగుస్వామి టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు చెబుతున్నారు.
లింగుస్వామి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతానని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.







