తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ స్కాం కేసు( Sheep Distribution Scam )లో ఏసీబీ విచారణ కొనసాగుతోంది.ఈ మేరకు మొదటి రోజు కస్టడీలో జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యను ఏసీబీ అధికారులు( ACB Officials ) విచారిస్తున్నారు.
ఈ క్రమంలో బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయంలో నిందితులను విచారించారు.అంజిలప్ప మరియు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ కు మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీసింది.అంజిలప్ప, మొయినుద్దీన్ కలిసి రూ.2.10 కోట్లు కొట్టేసినట్లు ఏసీబీ గుర్తించింది.అదేవిధంగా అంజిలప్ప ఆస్తులపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.