బీఆర్ఎస్ పై బీజేపీ నేత రఘునందన్ రావు( BJP Leader Raghunandan Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ టికెట్లను అమ్ముకుంటుందన్నారు.
బీఆర్ఎస్( BRS ) టికెట్ ఇచ్చేందుకు మెదక్ గడ్డపై పుట్టిన వాళ్లు దొరకడం లేదన్న ఆయన పక్క జిల్లాల నుంచి బీఆర్ఎస్ అరువు తెచ్చుకుంటుందని విమర్శించారు. కేసీఆర్( KCR ) కోసం త్యాగం చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి వంటి నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
నిజమైన ఉద్యమకారులకు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన తెలిపారు.







