MLC Kavitha : రాజకీయ కక్షతోనే కేసు పెట్టారు..: ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ముగిసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను( BRS MLC kavitha ) ఈడీ కార్యాలయానికి అధికారులు తరలించారు.కోర్టు ఆవరణలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత తనది అక్రమ అరెస్ట్ అని చెప్పారు.

 A Case Was Filed With The Political Party Itself Mlc Kavitha-TeluguStop.com

తనపై తప్పుడు కేసు పెట్టారన్న ఆమె న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని ఆరోపించారు.

గతంలో అడిగిన ప్రశ్నలే ఈడీ అధికారులు( ED officials ) అడుగుతున్నారన్న ఆమె కొత్తగా ఏం లేదని పేర్కొన్నారు.అలాగే ఎన్నికల సమయంలో అరెస్టులు సరికాదని కవిత అన్నారు.

దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలన్న ఆమె అరెస్టులపై ఈసీ దృష్టి సారించాలని కోరారు.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో ఎమ్మెల్సీ కవిత కస్టడీ మరో మూడు రోజుల పాటు పొడిగింపు అయింది.

దీంతో ఆమె ఈ నెల 26 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube