పార్వతీపురం( Parvathipuram ) మన్యం జిల్లాలో గజరాజులు హల్ చల్ చేశారు.జియ్యమ్మవలస మండలం పెదమేరంగి ప్రధాన రహదారిపై ఏనుగుల గుంపు సంచరించింది.
దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అనంతరం పంట పొలాల్లోకి వెళ్లిపోయాయి.
మరోవైపు ఏనుగుల సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అలాగే తమ పంట పొలాలను ఏనుగులు( Elephants ) ధ్వంసం చేస్తున్నాయని వాపోతున్నారు.ఏనుగుల గుంపు సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులకు( Forest Department officials ) ఎన్ని సార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగులను అటవీ ప్రాంతాల్లోకి తరిమివేయాలని కోరుతున్నారు.