మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి గేమ్ చేంజర్ ( Game Changer ) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
మరి కొద్ది రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తోంది.ఇక ఈ సినిమా అనంతరం ఈయన బుచ్చిబాబు( Bucchi Babu ) దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా పూజ కార్యక్రమాలను జరుపుకుంది.బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రామ్ చరణ్( Ram Charan ) జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) హీరో హీరోయిన్లుగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు.త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుంది.ఇదిలా ఉండగా చిరంజీవి వారసుడిగా రాంచరణ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతి సినిమా టైటిల్ కి ముందు మెగా పవర్ స్టార్ ( Mega Power Star ) రామ్ చరణ్ అనే బిరుదు వచ్చేది.

ఇప్పటివరకు రామ్ చరణ్ నటించిన సినిమా టైటిల్ కార్డ్స్ లో, పోస్టర్స్ లో రాంచరణ్ పేరు ముందు మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఉండేది.కానీ ఇప్పుడు అది సడెన్ గా ఆగిపోయింది. ఇటీవల జరుపుకున్నటువంటి కొత్త సినిమా పూజ కార్యక్రమాల నుంచి ఆయన బిరుదు మారిపోయిందని ఈ విషయాన్ని మైత్రి వారు అధికారికంగా ప్రకటించారు.ఇకపై రామ్ చరణ్ పేరు ముందు మెగా పవర్ స్టార్ కాకుండా గ్లోబల్ స్టార్ ( Global Star ) అనే ట్యాగ్ ప్రకటించారు.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రాంచరణ్ కి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు లభించింది.ఫ్యాన్స్ కూడా గ్లోబల్ స్టార్ రాంచరణ్ అని ట్రెండ్ చేస్తున్నటువంటి తరుణంలో ఏకంగా ఆయన పేరుని కూడా మార్చేసారని తెలుస్తోంది.