కుంభకోణాలకు కేరాఫ్ గా మారిన ఎస్బీఐ బ్యాంక్ శాఖలు...!

సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఎస్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థ కుంభకోణాలకు కేరాఫ్ గా మారింది.సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ 4.5 కోట్లు కాజేసిన ఘటన మరువక ముందే ఇదే జిల్లాలో నూతనకల్ మండలం తాళ్లసింగారం బ్రాంచ్ మేనేజర్ బాగోతం వెలుగులోకి వచ్చింది.దీనితో జిల్లాలో బ్యాంక్ లో డబ్బుల భద్రమేనా అని ఎస్బీఐ ఖాతాదారులు ఆందోళనలో పడ్డారు.

 Sbi Bank Branches That Have Become A Carafe For Scams, Scams, Sbi Bank Branches-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నూతనకల్ మండలం తాళ్లసింగారం గ్రామంలో గత ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ హరిప్రసాద్,బ్యాంక్ సమీపంలోని ఆధార్ సెంటర్ నిర్వాహకులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఫైనాన్షియల్ ఎఫ్ఓఎస్ తో కలిసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి,అగ్రికల్చర్ ముద్ర పథకంలో ఎస్.హెచ్.జి పేరిట రూ.1.30 కోట్లు, అగ్రికల్చర్ లోన్లు రూ.65 లక్షలు,ముద్రలోన్లు రూ.90 లక్షలు మొత్తం రూ.2.85 కోట్లు నొక్కేశాడు.ఆ డబ్బును తన బంధువుల ఖాతాలోకి బదిలీ చేసి, ఏమీ తెలియనట్లు తానే ప్రతినెలా ఈఎంఐలు చెల్లిస్తున్నాడు.దీనికి బ్యాంక్ ఎఫ్ఓఏ సహాయం చేసేవాడు.మూడు నెలల క్రిందట బ్యాంక్ లో ఆడిట్ నిర్వహించగా మేనేజర్ బాగోతం బట్టబయలు అయింది.రంగంలోకి దిగిన అధికారులు ఎక్వైరీ చేయగా నకిలీ డాక్యుమెంట్లతో పాటు నకిలీ ఇన్విషన్ లేని యూనిట్ల పేరిట లోన్లు తీసుకున్నట్టు తేలింది.

దీనితో బ్యాంకు మేనేజర్ హరిప్రసాద్ తో పాటు ఆయనకు సహకరించిన వారితో కలిపు మొత్తం14 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.మేనేజర్ ఎఫ్ఓఎస్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను సస్పెండ్ చేసి,మూడు నెలల్లోపు రూ.2.85 కోట్ల డబ్బులు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు.ఈ కేసులో 14 మందిపై కేసు నమోదు చేశామని నూతనకల్ ఎస్ఐ నరేష్ తెలిపారు.ప్రస్తుత మేనేజర్ రవీందర్ ఇచ్చిన ఫిర్యాదుతో క్రైమ్ నెంబర్ 33/2024;U/s: 409,417,420,120(B) I.P.C ల క్రింద మొత్తం 14 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube