ఫ్రీ , ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ జరిగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయాలి - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని పోలీస్ అధికారులు,సిబ్బంది నిర్వహించవలసిన విధి విధానాలపై జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ.శాంతియుత వాతావరణంలో లోక్ సభ ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్క అధికారి ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని,ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి పని చేస్తూ,ఎన్నికల నియామావళి ఉల్లంఘనాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు.

 Everyone Should Work Responsibly For Free Fair And Peaceful Elections Sp Akhil M-TeluguStop.com

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ….ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాల కీలకమైనదని, ఆ ఎన్నికల పక్రియ శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా, పారదర్శకంగా,నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ సమిష్టిగా విధులు నిర్వహించాలని,ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజూ,పోలింగ్ ముందు రోజు, పోలింగ్ తరువాతి రోజు పోలీస్ సిబ్బంది నిర్వహించవలసిన విధుల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు.

ఎన్నికల సందర్భంగా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ,గత ఎన్నికలలో నేర చరిత్ర ఉన్నవారు, రౌడీషీటర్లు, ఎన్నికల్లో శాంతికి విఘాతం కలిగించే వారి జాబితా సిద్ధం చేసుకోని వారికి కౌన్సిలింగ్ నిర్వహించి సంబంధిత అధికారుల ముందు బైండోవర్ చేయాలన్నారు.ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఓటర్లను ప్రలోభపరిచేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ,ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తూ అక్రమ నగదు,మద్యం,ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్ లో వాహనాల తనిఖీ, డైనమిక్ చెక్ పోస్ట్ లు పెట్టి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు.క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు వల్నరబుల్ పోలింగ్ ప్రాంతాలకు గుర్తింపు పట్ల స్పష్టత ఉండాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని గత ఎన్నికల్లో అమలు చేసిన గుడ్ ప్రాక్టీస్ ను అమలు చేయాలన్నారు.

ఎన్నికల నిర్వహణకు ముందే ఈ విధం అయినా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం వల్ల ఎన్నికల నిర్వహణ మరింత సులభతరంగా ఉంటుందని అన్నారు.

ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా పోస్ట్ లపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి.

లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు, యువత సోషల్ మీడియా వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని,సోషల్ మీడియా పై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని సూచించారు.విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వచ్చే ప్రకటనలు, చిత్రాలు షేర్ చేయవద్దని కోరారు.

అనవసర మెసేజ్లు పెట్టి ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు.యువత కేసులపాలై జీవితాలు నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు.

కేసులు అయితే వారి భవిష్యత్తు కూడా ఎంతో ఇబ్బంది అవుతుందని ఎస్పీ తెలిపారు.ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ లు,సి.

ఐ లు ,ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube