అసలే ఓవైపు సినిమాలు లేవు,,, మరోవైపు వస్తున్న సినిమాలను కూడా రిజెక్ట్ చేస్తోంది శ్రీలీల.( Sreeleela ) వాస్తవానికి రాఘవేంద్ర రావు స్కూల్ నుంచి వచ్చిన హీరోయిన్స్ అందరూ కూడా గ్లామర్ విషయంలో అదరగొడుతూ మంచి అవకాశాలు దక్కించుకొని వారి కంటూ ఒక స్టార్ డం తో దూసుకుపోతూ ఉంటారు.
దాంతో అయన స్కూల్ నుంచి వచ్చిన శ్రీలీల ఆల్మోస్ట్ అదే పంథాలో వెళ్తుంది అనుకున్నారు కానీ ఒకప్పటి సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు ఉన్న పోకడకు చాలా తేడా ఉంది కాబట్టి శ్రీలీల కొన్ని విచిత్రమైన కష్టాలను ఎదుర్కొంటుంది.సినిమాలు లేక ఇబ్బంది పడటం ఓవైపు వచ్చిన సినిమాలను వదులుకోవడం మరోవైపు.
అసలు ఏంటి కహాని ఎందువల్ల శ్రీలీల కు ఇన్ని విచిత్రమైన కష్టాలు వస్తున్నాయి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ధమాకా( Dhamaka ) సినిమా తో మంచి హీరోయిన్ గా గుర్తింపు ఇచ్చింది.ఆమె డ్యాన్స్ కు టాలీవుడ్ మొత్తం ఫిదా అయిపోయింది.ఆ తర్వాత స్కంద, ఆదికేశవ వంటి వరుస ప్లాప్ చిత్రాల్లో నటించిన శ్రీలీల భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమాతో పర్వాలేదనిపించింది.
కానీ గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమాతో మళ్లీ మొదటికే వచ్చింది.ఆ సినిమా పరాజయం కాస్త ఆమె కెరియర్ పై పడింది.దాంతో ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంది.ఉస్తాద్ సినిమా షూటింగ్ ఉన్నప్పటికి అది ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి.
విజయ్ దేవరకొండ కి కూడా ఒక సినిమా చేయాల్సి ఉన్న అతడు ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్ తో బిజీగా ఉన్నాడు.
మరి ఈ రెండు సినిమాల షూటింగ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఖాళీగానే ఉన్న శ్రీలీల టైం దొరికింది కదా అని తన ఎంబిబిఎస్ చదువులపై ఫోకస్ చేసే పనిలో పడింది.ఈ క్రమంలో ఒకసారి ఆమె స్టడీస్ లోకి రాగానే కొన్ని సినిమాలు ఆమెకు వస్తున్నాయట.కానీ ఏదో ఒక పని మాత్రమే పూర్తిగా చేస్తానని నిర్ణయించుకున్న శ్రీలీల కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూ వస్తున్నారట.
అయితే పెద్ద సినిమాలు అయినా రెండు ఉస్తాద్ మరియు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) చిత్రాలు వచ్చేంత వరకు కూడా ఆమె చిన్న సినిమాలను పక్కన పెట్టే పనిలో ఉన్నారు.ఇంత వరకు సినిమాల అవకాశాలు రావట్లేదు అని బెంగ పడ్డ శ్రీలీల ఇప్పుడు అవకాశాలు వచ్చినా కూడా ఒప్పుకునే పరిస్థితిలలో లేదు.