టాలీవుడ్ కి మరొక జక్కన( Jakkanna ) దొరికేశాడు.చాలా ఏళ్లుగా సినిమాలు చెక్కుతూ చెక్కుతూ అవుట్ ఫుట్ ఇవ్వడం రాజమౌళి( Rajamouli ) మాత్రమే చేస్తూ వస్తున్నాడు అనుకుంటే పొరపాటే.
ఇప్పుడు ఆ లిస్టులో మరొక డైరెక్టర్ కూడా వచ్చి చేరాడు.ప్రతి సినిమాను మూడు ఏళ్లకు మించి షూటింగ్ జరుపుతూ మరో రాజమౌళి లాగా అవతారం ఎత్తేశాడు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ఇలా రెండు మూడేళ్లు పాటు సినిమాకి గ్యాప్ తీసుకోవడం అలవాటే.కానీ ప్రతి సినిమాకు తీసుకోవడం అంటే కొంచెం టూమచ్ అని అర్థం.
అయితే ఇప్పుడు మరి మరో జక్కన్నగా మారిన ఆ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరు ? అతడు చెక్కుతున్న ఆ సినిమా ఏంటి అనే వివరాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
టాలీవుడ్ జక్కన్న కు డూప్ గా తయారైన ఆ డైరెక్టర్ మరెవరో కాదు నాగ్ అశ్విన్.( Nag Ashwin ) మహానటి సినిమాతో టాలీవుడ్ లో మంచి దర్శకుడి గా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు ఇప్పుడు ప్రభాస్ తో( Prabhas ) కల్కి సినిమాని( Kalki Movie ) చాలా రోజులుగా చెక్కుతూ వస్తున్నాడు.2018 లో మహానటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పిట్టకథలు అనే ఒక ఆంతాలజీ ఫిలిం నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది.ఇది 2022లో విడుదలైంది ఆ తర్వాత కల్కి సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు నాగ్ అశ్విన్.ఈ సినిమాకి పూర్తి పేరు కల్కి 2898 AD.ఇది ప్యాన్ వరల్డ్ సినిమా గా తెరకెక్కుతుంది.షూటింగ్ అయితే 2022లో మొదలైంది కానీ దాదాపు ఐదేళ్లుగా ఈ సబ్జెక్టు పై నాగ్అశ్విన్ పని చేస్తున్నారు.
మహాభారతం( Maha Bharatam ) దగ్గర మొదలైన ఈ సినిమా కథ 2800 వ సంవత్సరం వరకు కూడా వెళుతుందట.ఇంత వేరియేషన్ చూపించాలంటే అది మామూలు విషయం కాదు.
గతం నుంచి భవిష్యత్తుకు ప్రయాణం చేసే ఈ సినిమాలో ప్రభాస్ ఖచ్చితంగా అందరిని మెప్పిస్తాడు అని నాగ్ అశ్విన్ నమ్మకంగా ఉన్నాడు.
అయితే చాలా రోజులుగా ఎన్నికలు వస్తున్నాయని భయంతో సినిమాలు విడుదల చేయడానికి అందరు భయపడుతుంటే దొరికిందే ఛాన్స్ అని నాగ్ అశ్విన్ మాత్రం మరో కొన్ని రోజుల పాటు ఈ సినిమాను చెక్కే పని లో ఉన్నాడట.ఈ గ్యాప్ ని బాగా ఉపయోగించుకొని ఎలాగో లేట్ అవుతుంది కాబట్టి మరింత మెరుగ్గా సినిమాను బయటకు తేవాలి అనుకుంటున్నాడు.దాంతో ఇలా సినిమాను చెక్కుతున్న నాగ్ అశ్విన్ టాలీవుడ్ కి మరో జక్కన్న లాగా మొదలుపెట్టాడు అని అనుకుంటున్నారు.
మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో లేదో తెలియాలంటే థియేటర్స్ కి వచ్చే వరకు వేచి చూడాలి.