తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వివి వినాయక్( VV Vinayak ) రాజమౌళి( Rajamouli ) ఇద్దరూ పోటీపడుతూ సినిమాలు చేస్తూ స్టార్ హీరోలందరికీ మంచి విజయాలను అందించారు.ఇక ఒకరిని మించి మరోకరు సూపర్ సక్సెస్ లను అందివ్వడమే కాకుండా ఫ్యాన్స్ ని కూడా ఖుషి చేశారు.
ఇక దాంతో వీళ్లిద్దరూ కూడా భారీ సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకున్నారు.ఇక ఇలాంటి సమయంలోనే ప్రస్తుతం వినాయక్ కెరియర్ లో కొంచం వెనకబడి ఉండగా, రాజమౌళి మాత్రం పాన్ వరల్డ్ లో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడనే చెప్పాలి.

ఒకప్పుడు వీళ్ళు సినిమాలు చేస్తున్నప్పుడు రాజమౌళి వినాయక్ కి ఒక మాట చెప్పాడట.అదేంటి అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేయడం( Movie Making ) అనేది చాలా పెద్ద పని దాన్ని మనం ఎంత సక్సెస్ ఫుల్ గా చేస్తాం అనేది మాత్రమే ఇక్కడ జనాలు గుర్తుపెట్టుకుంటారు.కాబట్టి మనం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎంత హార్డ్ వర్క్ చేసిన పర్లేదు కానీ సక్సెస్( Success ) మాత్రం పక్కగా కొట్టాలి.అలాంటప్పుడే మనకు ఒక గుర్తింపు వస్తుంది.
దాంతో పాటుగా మనకంటూ ఇండస్ట్రీ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది అని చెప్పాడట.దాంతో వినాయక్ రాజమౌళికి ఒక హగ్ ఇచ్చి సూపర్ గా చెప్పావ్ రాజమౌళి అని అన్నాడట…

ఇక మొత్తానికైతే రాజమౌళి, వినాయక్, జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు చాలా మంచి సన్నిహితంగా ఉండేవారు.ఇక తరచుగా కలుసుకుంటూ ఒకరి సినిమాల గురించి ఒకరు మాట్లాడుతూ ఉండేవారట.ఇక ప్రస్తుతం వివి వినాయక్ సినిమా కెరియర్ అనేది డైలమాలో పడిపోయింది.
కాబట్టి ఆయన కి ఏ హీరో కూడా అవకాశం అయితే ఇవ్వడం లేదు.ఇక ఇది ఇలా ఉంటే రాజమౌళి మాత్రం ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తు పాన్ ఇండియా ఇండస్ట్రీ లో సూపర్ సక్సెస్ లు అందుకుంటున్నాడు… ఇక మొన్నటి వరకు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేసిన రాజమౌళి ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమాతో ప్రేక్షకులు అలరించడానికి సిద్ధమవుతున్నాడు…
.







