టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్( Kalyan ram ) చివరగా డెవిల్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.
కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరక్కించిన ఈ సినిమా ఊహించని విధంగా నష్టాలను మిగిల్చింది.ఆ బడ్జెట్ కి తగ్గట్లుగా బజ్ క్రియేట్ చేయడంలో, ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ వెనుకబడింది.
అదే విధంగా దర్శకుడి విషయంలో నెలకొన్న వివాదం కూడా ఈ చిత్రానికి మైనస్ అయింది.
కథని ఇంకాస్త ఎఫెక్టివ్ గా చెప్పి, ప్రమోషన్స్ చేసి ఉంటే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేది.చూసిన వారంతా డీసెంట్ మూవీ అని అన్నారు.ఎలాగైతే నేం సినిమాకి ఆశించిన రిజల్ట్ రాలేదు.
ఓటిటిలో పర్వాలేదనిపించింది.కానీ బుల్లితెరపై డెవిల్ చిత్రానికి ఊహించని షాక్ ఎదురైంది.
అసలు ఎవరు ఊహించని రెస్పాన్స్ వచ్చింది.ఈటీవీ ఈ చిత్ర శాటిలైట్ హక్కులని( Satellite Rights ) భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది.
కానీ ఈ చిత్రానికి మినిమమ్ టీఆర్పీ కూడా దక్కలేదు.ఈ చిత్రాన్ని ఫస్ట్ టైం టెలికాస్ట్ చేసినప్పుడు కేవలం 1.86 రేటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.మరీ టీఆర్పీ రేటింగ్ దారుణంగా నమోదు కావడంతో అంతా షాక్ అవుతున్నారు.
దీనికి సినీ వర్గాల్లో ఆసక్తికర విశ్లేషణ సాగుతోంది.బుల్లితెరపై మంచి టీఆర్పీ రావాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలు ఉండాలి.కానీ డెవిల్ చిత్రం( devil movie )లో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించేలా ఎలాంటి అంశాలు లేవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.