ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Arvind Kejriwal ) ను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు.ఈ క్రమంలో లిక్కర్ స్కాం కేసులో ఆయనను అరెస్ట్ చేసిన ఈడీ( ED Officials ) పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనుంది.
మరోవైపు కేజ్రీవాల్ కస్టడీకి ఆయన తరపు న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.ఈ క్రమంలోనే కేజ్రీవాల్ తరపున అభిషేక్ మనుసింఘ్వి, విక్రమ్ చౌదరి వాదనలు వినిపించనున్నారు.
అదేవిధంగా ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు.ఈ నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court )లోనే పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కాగా నిన్న దాదాపు మూడు గంటల పాటు కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.