మన దేశంలో ఫుడ్ సంబంధించిన వీడియోలకు సోషల్ మీడియాలో కొదవెలేదు.ఈ మధ్యకాలంలో కొందరు అదేపనిగా ఫుడ్ వ్లోగ్స్ అంటూ రోడ్లమ్మడి ఉండే హోటల్స్, రెస్టారెంట్స్, చిన్నచిన్న బండ్ల వ్యాపారం దగ్గరికి వెళ్లి అక్కడ వారు చేస్తున్న వ్యాపారాన్ని వీడియోలు తీసి మరి సోషల్ మీడియాలో పెడుతున్నారు.
ఇలా చేయడం వల్లనే హైదరాబాదులోని కుమారి ఆంటీ ఫేమస్ ఎంత అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇలా అనేకమంది వీడియోలు తీయడం సోషల్ మీడియా( Social media )లో పెట్టడం అది కాస్త వైరల్ గా మారుతుండడం గమనిస్తూనే ఉంటారు.
ఇక అసలు విషయంలోకి వెళ్తే.

మనం కాఫీ బార్స్ సంబంధించిన వాటిలో లాట్ ఆర్ట్ గురించి చూస్తూనే ఉంటాము.ఇలా అనేకమంది వారికి నచ్చిన విధంగా ఆర్ట్ వేస్తూ కస్టమర్స్ ని ఆకట్టుకుంటున్నారు.ఇక లాట్ ఆర్ట్ కు ఎంతో ఓపిక, నేర్పు, సృజనాత్మకత, సహనం వంటివి చాలా అవసరం.
ఈ ఆర్ట్ కు సంబంధించి కూడా వీడియోలు మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాం.ప్రస్తుతం ఈ తరహా సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పానీపూరి( Panipuri ) లో వేసిన ఈ ఆర్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

మామూలుగా లాటు ఆర్ట్ కేవలం కప్పులు, మగ్గులు లాంటి వస్తువులలో మాత్రమే చూస్తుంటాం.కాకపోతే ఇప్పుడు వైరల్ గా మారిన వీడియోలో మాత్రం పానీపూరిపై ఆర్టిస్ట్ వేసిన ఆర్ట్ ఔరా అనిపిస్తుంది.అతడు ఓ పానీపూరిని తీసుకుని అందులో కాఫీ లిక్విడ్ తీసుకొని అందులోకి ఒక కప్పులో ఉన్న పాలను డిజైన్ గా వేస్తూ వచ్చాడు.
నిజానికి అది చూడటానికి ఎంతో బాగుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.నెట్టిజెన్స్ వారి స్టైల్ లో కామెంట్ చేస్తున్నారు.కొందరు ఈ వంటకానికి కపురిసినో, లాట్‌పూరి, గప్పెచినో, కాఫీపూరి, పూరిచినో పేర్లు పెట్టారు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.







