నిహారిక కొణిదెల ( Niharika Konidela ) పరిచయం అవసరం లేని పేరు.ఇండస్ట్రీలోకి స్టార్ డాటర్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గా పనిచేశారు అనంతరం హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ రాకపోవడంతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
అయితే ఈమె వైవాహిక జీవితంలో కూడా సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి.ఈమె పెళ్లి చేసుకున్నప్పటికీ తన భర్త అత్తింటి వారితో విభేదాల కారణంగా భర్తకు విడాకులు ఇచ్చి విడిపోయారు.
ఇలా భర్త నుంచి విడిపోయినటువంటి ఈమె ప్రస్తుతం ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతున్నారు అయితే సినిమాలపై ఎంతో పిచ్చి ఉన్నటువంటి నిహారిక తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్( Pink Elephant Pictures Banner ) స్థాపించడమే కాకుండా నటిగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
అలాగే యాంకర్ గా కూడా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.
ఇలా కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నటువంటి నిహారిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ లో త్రో బ్యాక్ ఫోటోలను షేర్ చేశారు.గోవాలో ఒకప్పుడు దిగిన ఫోటోలు అంటూ ఈమె ఆ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
ఇందులో భాగంగా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని ఈమె పడుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు తన అందాలన్నింటినీ ఆరబోస్తూ ఆ అందాలను కనపడకుండా ఆకును అడ్డుగా పెట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు.
ప్రస్తుతం నిహారిక షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ ఫోటోలలో నిహారిక నవ్వుతూ కనిపించడంతో ఆ నవ్వు చూసి బ్రతికేయొచ్చు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు యధావిధిగా నెగిటివ్ కామెంట్లతోనే ట్రోల్ చేస్తున్నారు.నిహారిక ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రస్తుతం తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు అయితే ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను ఈమె అభిమానులతో పంచుకుంటున్నారు.