క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 17 సీజన్( IPL 17 Season ) నేడు అంగరంగ వైభవంగా మొదలు కాబోతుంది.సాయంత్రం 7 : 30 గంటలకి మొదటి మ్యాచ్ చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే.
ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ( Mumbai Indians )కాస్త ఆ టీం మేనేజ్మెంట్ పై ఇంకా కోపంగానే ఉన్నారు.రోహిత్ శర్మ కెప్టెన్సీ నుండి తీసేసిన సమయం నుండి ఫ్యాన్స్ కాస్త టీం మేనేజ్మెంట్ కోపంగానే ఉన్నారు.ఇప్పటికే ముంబై ఇండియన్స్ అభిమానులు చాలామంది ఆ టీం సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను అన్ ఫాలో చేశారు.
అప్పటి నుంచి మొదలు.సందు దొరికినప్పుడల్లా ముంబై ఇండియన్స్ ను అభిమానులు టీమ్ మానేజ్మెంట్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు సోషల్ మీడియాలో.
ప్రెస్ వేదికలో కెప్టెన్సీ హోదాలో హార్దిక్ పాండ్యా( Hardik Pandya ), కోచ్మార్క్ బౌచర్ ఈ విషయంపై సంజాయిషీ ఇచ్చినప్పటికీ అభిమానులు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు.
తాజాగా ముంబై అభిమానులు తమ నిరసన మరింత డోస్ పెంచారు.కొందరైతే ముంబై ఇండియన్స్ జెర్సీలను తగలబెట్టడమే కాకుండా. BOYCOTT MI JERSEY అంటూ సోషల్ మీడియాలో హష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
అంతేకాకుండా మీరు ఎవరు కూడా ముంబై ఇండియన్స్ కు మద్దతు ఇవ్వద్దని పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు.మరికొందరైతే కెప్టెన్ మార్పు సచిన్ కుట్ర అని కూడా వాదిస్తున్నారు.
ముఖ్యంగా తన కొడుకు అర్జున్ టెండూల్కర్ కి రోహిత్ సరైన అవకాశాలు ఇవ్వట్లేదని అందుకే సచిన్ రోహిత్ పై ఇలాంటి పనులు చేసి ఉంటాడని కొందరు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు.ఇక ఆదివారం నాడు అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ తో తలపడునుంది.