తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి( Rajamouli ) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును పొందుతున్నాడు.ఇక ఇప్పటికే పాన్ ఇండియా లో తన సత్తా చాటుకున్న ఈ దర్శకుడు.
పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందుకోసమే చాలా కసరత్తులను కూడా చేస్తున్నాడు.
ఇక మహేష్ బాబుని హీరోగా పెట్టి చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లో కూడా చాలా రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి రాజమౌళి చేస్తున్న ఈ ప్రయోగానికి దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉండడం విశేషం… రాజమౌళి సక్సెస్ వెనుక తన భార్య ఉందని రాజమౌళి చాలాసార్లు చెప్తూ ఉంటాడు.రాజమౌళి భార్య అయిన రమా రాజమౌళి( Rama Rajamouli ) సినిమాకు సంబంధించిన అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అవుతూ రాజమౌళికి పెద్దగా స్ట్రెస్ లేకుండా ఆమె ఎక్కువగా డీల్ చేస్తూ ఉంటారని ఆయన చాలాసార్లు చెప్పాడు.అలాగే తనకు ఏం కావాలి అనేది కూడా రమా రాజమౌళి తెలుసుకొని వాటిని సెట్ చేసి పెట్టడానికి అన్ని క్రాఫ్ట్ ల వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ ఉంటుందని కూడా ఇప్పటికి చాలాసార్లు రాజమౌళి చెప్పాడు.
ఇక రాజమౌళి రామ రాజమౌళి లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

అయితే రాజమౌళి భార్య అయనకంటే 4 సంవత్సరాలు పెద్దదనే విషయం చాలా మందికి తెలియదు.ముఖ్యంగా రమా ముందు వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే తనకు కార్తికేయ( Karthikeya ) పుట్టాడు.ఆ తర్వాత తన భర్త చాలా ఇబ్బంది పెట్టడం తో ఆమె కొద్ది రోజులు వాళ్ల సిస్టర్ అయిన వల్లి వాళ్ళ ఇంట్లో ఉంది.
ఇంకా ఎప్పటికీ తన భర్త మారకపోవడంతో వల్లి వాళ్ళ ఇంట్లోనే చాలా రోజులపాటు ఉండేది.అలా ఆ ప్రాసెస్ లోనే రాజమౌళి ఆమెను లవ్ చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
ఇక మొత్తానికైతే రాజమౌళి రమా ప్రస్తుతానికి అన్యోన్యంగా ఉంటారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.