హైదరాబాద్(Hyderabad ) నగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు.ఈ మేరకు స్టాక్ మార్కెట్ల పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు.
స్టాక్ ఎక్చేంజ్ లో తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు ఇప్పిస్తామని నగర వాసులను చీటింగ్ చేశారని తెలుస్తోంది.
ఈ విధంగా పలువురి వద్ద రూ.20 కోట్లవరకు సైబర్ నేరగాళ్లు( Cyber criminals ) కాజేశారు.మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు సైబర్ కేటుగాళ్లను అరెస్ట్ చేశారు.ఈ నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.