ప్రతిరోజు మనం సోషల్ మీడియా( Social media )లో అనేక రకాల వీడియోలు చూస్తూ ఉంటాము.ఇందులో భాగంగానే అప్పుడప్పుడు వాహనాలు ప్రమాదాలకు గురైన వీడియోలు కనబడడం చూస్తూనే ఉంటాం.
అలాంటి ఓ వీడియో ప్రస్తుతం తాజాగా వైరల్ గా మారింది.వీడియో చూసినట్లయితే.
బస్సును ఓ బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి బస్సు ను ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న డీసీఎం లారీ అతన్ని గుద్దుకుంది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం( Pargi ) హైదరాబాద్ – బీజాపూర్ హైవేపై చోటు చేసుకుంది.బైకర్ తన ముందు వెళ్తున్న బస్సును ఓవర్‌టేక్ చేస్తుండగా అనుకోకుండా ఎదురుగా వేగంగా వచ్చిన డీసీఎం లారీని ఢీకొట్టాడు.దాంతో అతను ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.దింతో ప్రస్తుతం ఈ ఘటన రికార్డు అయిన సీసీటీవీ ఫ్యూటేజీ( CCTV footage ) వైరల్ గా మారింది./br>

కాబట్టి ఎవరైనా వాహనాలు నడిపే సమయంలో కాస్త ముందు వెనుక చూసి నడిపితే వారి ప్రాణాలను రిస్క్ చేయకుండా వెళ్ళవచ్చు.ఇలాంటి ప్రమాదాల వల్ల కొందరు వారి కుటుంబ పెద్దలను కోల్పోవడం ద్వారా అనేకమంది రోడ్డు పాలు ఆయన సంఘటనలు మనం చాలానే చూసాం.కాబట్టి రోడ్డుపై వెళ్తున్న సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ మన ప్రాణాలను కాకుండా ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టకుండా డ్రైవ్ చేస్తే మంచిది.ముఖ్యంగా మద్యం సేవించిన సమయంలో ఇలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా ఉంటె మంచిది.







