సూర్యాపేట జిల్లా:జిల్లాలో మిగిలి ఉన్న ఉపాధి కూలీలా బ్యాంక్ అక్కౌంట్( Bank account ) కు ఆధార్ అనుసంధానం సత్వరమే చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( Collector S.
Venkatrao ) సంబంధిత అధికారులను ఆదేశించారు.కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నందు డిఆర్ డిఓ సిబ్బంది పోస్టల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉన్న వారికి వేసవిలో ఎక్కువ పనులు కల్పించాలని సూచించారు.
జిల్లాలోని ఇంకా 8925 మంది ఉపాధి హామీ పథకం( Rural Employment Guarantee ) కూలీలకు ఆధార్ కు బ్యాంకు అకౌంటు అనుసంధానం చేయవలసి ఉందని,NPCI పనులను సత్వరమే పూర్తి చేసి కూలీలకు సకాలంలో వేతనాలు అందేవిధంగా చూడాలని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ ను కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో డిఆర్డీఓ జి.మధుసూదనరాజు,పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.