తెలుగు బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) గురించి మనందరికి తెలిసిందే.గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పేరు వినిపిస్తూనే ఉంది.
పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉన్నాయి.ఇది ఇలా ఉంటే కొంతమంది నెటిజెన్స్ సోషల్ మీడియాలో ప్రశాంత్ ట్రోలింగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
దీంతో తాజాగా ఆ వార్తలపై శివాజీ( Sivaji ) మండిపడ్డారు.ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.
రైతుల గోసను, కష్టాలకు అండగా నిలబడి పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ కలను నెరవేర్చుకొన్నాడు.
బిగ్‌బాస్ ఇంటిలో గాయాలను లెక్క చేయకుండా, కంటెస్టెంట్ల నుంచి మానసికంగా దాడిని తప్పించుకొని ధైర్యంగా నిలబడ్డాడు.అలాంటి రైతు బిడ్డను( Rythu Bidda ) సోషల్ మీడియాలో అది చేయలేదు.ఇది చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.
అసలు ప్రశాంత్ గురించి మీకు తెలుసా? అతడు చేసే పనులు గురించి తెలియకుండా ఎలా ప్రశ్నిస్తారు అంటూ శివాజీ ఫైర్ అయ్యాడు.ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయిని పట్టుకొని ప్రశ్నిస్తున్నారు.
అదే మీకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి.వాటిని నెరవర్చని రాజకీయ నేతలను ప్రశ్నించగలరా? ఎన్నికల సమయంలో ఎన్నో చేస్తామని ఆశ చూపి తప్పించే వారిని నిలదీయగలరా? ఒక రైతు బిడ్డను టార్గెట్ చేస్తూ మీరు చేసే పని బాగాలేదు అని శివాజీ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది శివాజీకి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.పల్లవి ప్రశాంత్ గ్రామంలో పిల్లల కోసం చేపట్టిన వెల్ఫేర్ కార్యక్రమాన్ని శివాజీ ప్రశంసించారు.ప్రశాంత్ చేసే ప్రతీ పని ముందుగా నాకు చెబుతాడు.తనకు ఎంతో చేయాలని ఉంది.కానీ బిగ్ బాస్( Bigg Boss ) నుంచి రావాల్సిన డబ్బులు అందకపోవడం వల్ల తాను అనుకొన్న పనులు, చేయాల్సిన పనులు చేయలేకపోతున్నాడు అని శివాజీ తెలిపారు.