YCP Janasena Pithapuram : పవన్ ఓటమే ధ్యేయం .. పిఠాపురం పై వైసీపీ స్పెషల్ ఫోకస్ 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) పిఠాపురం నియోజకవర్గ నుంచి పోటీ చేయబోతుండడంతో,  ఆ నియోజకవర్గంలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే విషయంపై వైసిపి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ ను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చూడాలని వైసిపి( YCP ) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

 Ycp Janasena Pithapuram : పవన్ ఓటమే ధ్యేయం .. పి-TeluguStop.com

  దీనిలో భాగంగానే సీనియర్ నేత,  మాజీ మంత్రి వంగ గీతను వైసిపి అభ్యర్థిగా జగన్ రంగంలోకి దించారు.కాపు సామాజిక వర్గానికి చెందిన వంగ గీత ఇక్కడ నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఓడించగలరనే అంచనాతో జగన్ ఆమెను అభ్యర్థిగా ప్రకటించారు.

ఈ నియోజకవర్గంలో వంగా గీతకు విస్తృతంగా పరిచయాలు ఉండడం, మహిళా సెంటి మెంట్ బాగా కలిసి వస్తాయని జగన్ అంచనా వేస్తున్నారు.పవన్ ఓడించేందుకు అన్ని అస్త్రాలను జగన్ సిద్ధం చేస్తున్నారు.

Telugu Ap, Jagan, Janasena, Janasenani, Pawan Kkalyan, Telugudesam, Ycppithapura

2019 ఎన్నికల్లో పవన్ గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాలలోనూ ఓటమి చెందడంతో ఈసారి అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఓడించాలని జగన్ చూస్తున్నారు.దీనిలో భాగంగనే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మండలాల వారీగా ఇంచార్జీలను నియమించారు.ఈ నియోజకవర్గంలోని పిఠాపురం,  గొల్లప్రోలు, యూ.కొత్తపల్లి మండలాలకు కీలక దినోత్సవ ఇంచార్జీలుగా జగన్( YS Jagan ) నియమించారు. ఈ మేరకు పిఠాపురం పై ప్రత్యేక దృష్టి పెట్టి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి.గొల్లప్రోలు మండలానికి ఇన్చార్జిగా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించారు.

అలాగే యూ.కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజాని సమన్వయకర్త నియమిస్తున్నారు.

Telugu Ap, Jagan, Janasena, Janasenani, Pawan Kkalyan, Telugudesam, Ycppithapura

అలాగే ఈ నియోజకవర్గ కాపు నేతల అందరిని పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను మాజీ మంత్రి , కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి( Mudragada Padmanabham ) అప్పగించారు.అలాగే పిఠాపురం లో డబ్బు, పోల్ మేనేజ్ మెంట్ ఇతర వ్యూహాలను అమలు చేసే బాధ్యతలు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు.అలాగే పిఠాపురం నియోజకవర్గంలోని ప్రధాన సామాజిక వర్గాల కు చెందిన కుల సంఘాల నాయకులను దారికి తెచ్చుకునేందుకు కీలక నేతలను రంగంలోకి దించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube