ఎలాంటి మచ్చలు లేకుండా చర్మాన్ని తెల్లగా మెరిపించుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.అయితే అటువంటి చర్మం కోసం కెమికల్స్ తో కూడిన ఉత్పత్తులను వాడటం కంటే సహజ పద్ధతులను ఎంచుకోవడం చాలా ఉత్తమం.
ముఖ్యంగా వైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ ను కోరుకునే వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ ది బెస్ట్( Homemade Cream ) అని చెప్పుకోవచ్చు.రెగ్యులర్ గా ఈ క్రీమ్ ను వాడారంటే అద్భుత ఫలితాలు మీ సొంతం అవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం, వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు మరియు నాలుగు బాదం పప్పులు( Almonds ) వేసి వాటర్ తో రెండు సార్లు వాష్ చేయాలి.
ఆ తర్వాత ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న బియ్యం, ఎర్ర కందిపప్పు మరియు బాదం వేసుకొని కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను స్ట్రైన్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు నీరు పూర్తిగా తొలగించిన పెరుగు ను వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు చిటికెడు పసుపు( Turmeric ) వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.దాంతో ఒక స్మూత్ క్రీమ్ సిద్ధం అవుతుంది.
ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.రోజు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని సున్నితంగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
మరుసటి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా ప్రతిరోజు కనుక చేశారంటే చర్మంపై ముదురు రంగు మచ్చలు క్రమంగా మాయమవుతాయి.స్కిన్ టోన్( Skin Tone ) ఇంప్రూవ్ అవుతుంది.కొద్దిరోజుల్లోనే మీ స్కిన్ వైట్ గా బ్రైట్ గా( Skin Whitening Brightening Cream ) మారుతుంది.
అలాగే ఈ క్రీమ్ ను వాడటం వల్ల వయసు పైబడిన కూడా యవ్వనంగా కనిపిస్తారు.ముడతలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
కాబట్టి మచ్చలేని మెరిసే తెల్లటి చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఈ క్రీమ్ ను ట్రై చేయండి.