మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan Tej ) ప్రస్తుతం శంకర్( Shankar ) దర్శకత్వంలో రాబోతున్నటువంటి గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది.
ప్రస్తుతం వైజాగ్ బీచ్( Vizag Beach ) పరిసర ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రామ్ చరణ్ గత కొద్దిరోజులుగా వైజాగ్ లోనే ఉంటున్నారు.ఇటీవల ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా రామ్ చరణ్ లుక్ కి సంబంధించిన పోస్టర్ వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమా చిత్రీకరణలో రాంచరణ్ ఎంతో బిజీగా ఉన్నారు.అయితే రామ్ చరణ్ కొద్దిరోజుల పాటు వైజాగ్ లోనే ఉండబోతున్నటువంటి తరుణంలో తన భార్య ఉపాసన( Upasana ) కుమార్తె క్లీన్ కారా ( Klin kara ) కూడా వైజాగ్ చేరుకున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ విరామ సమయంలో రామ్ చరణ్ తన భార్య కూతురుతో కలిసి సరదాగా వైజాగ్ బీచ్ లో ఎంజాయ్ చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కూతురిని ఎత్తుకొని సముద్రపు అలలను తాకిస్తూ బీచ్ ఒడ్డున రామ్ చరణ్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.ఇలా సంధ్యా సమయంలో సాగర తీరాన కూతురితో కలిసి గడిపిన ఆనంద క్షణాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఉపాసన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు.ఇక ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె వైజాగ్ మా హృదయాలను దోచుకుంది.క్లీన్ కారాతో కలిసి ఇది మా ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ వీడియోలో కూడా చిన్నారి ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడటం విశేషం.







