టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి సభ అట్టర్ ఫ్లాప్ అని మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) హాజరైన సభనే సరిగా నిర్వహించలేకపోయారని పేర్కొన్నారు.2014 లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఎంత ఆగం చేశారో అందరికీ తెలుసని చెప్పారు.ప్రజాగళంలో( Praja Galam ) మైకు మూగబోవడం ఓటమేనని పేర్కొన్నారు.
మైకును సరి చేసుకోలేని వాళ్లు రాష్ట్రాన్ని ఎలా నడపగలరని ప్రశ్నించారు.

ప్రజాగళం సభలో కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయన్న అంబటి మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా జగన్ ను( Jagan ) ఓడించలేరని స్పష్టం చేశారు.ప్రజాగళం సభ తరువాత చంద్రబాబులో( Chandrababu ) అభద్రతా భావం ఏర్పడిందన్నారు.అసలు చంద్రబాబు రాజకీయ జీవితం అంతా అభద్రతా భావమేనని తెలిపారు.
సభ దగ్గర భద్రతా వైఫల్యమంటూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.అయితే ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన ప్రజల గుండెల్లో ఉన్నది జగనేనని తెలిపారు.







