టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో చిరంజీవి ( Chiranjeevi ) వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan Tej ) ఒకరు.ఈయన చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రీ మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందగా ఈయన మాత్రం పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు.ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు లేదా సాధారణ ప్రజలందరూ కూడా ఇటీవల కాలంలో టాటూలు( Tattoo ) వేయించుకోవడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు.
![Telugu Ramcharan, Klin Kaara, Kuc Tattoo, Ram Charan, Tattoo, Tollywood, Upasana Telugu Ramcharan, Klin Kaara, Kuc Tattoo, Ram Charan, Tattoo, Tollywood, Upasana](https://telugustop.com/wp-content/uploads/2024/03/Hero-Ram-Charan-Upasana-Klin-Kaara-Tattoo-on-Chest-Viral.jpg)
వివిధ రకాల డిజైన్స్ లేదంటే వారికి ఎంతో ఇష్టమైనటువంటి వారి పేర్లను టాటూలుగా వేయించుకుంటూ వారిపట్ల ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తున్నారు.ఇక ఇండస్ట్రీలో( Film Industry ) కొనసాగే హీరోలందరూ కూడా వారికి నచ్చిన టాటూ లను వేయించుకుంటున్నారు కానీ ఇప్పటివరకు రామ్ చరణ్ మాత్రం ఒక్క టాటూ కూడా వేయించుకోలేదు.రామ్ చరణ్ ఇలా టాటూలు వేయించుకోకపోవడానికి కారణం లేకపోలేదు తన తండ్రి చిరంజీవికి ఇలా టాటూలు వేయించుకోవడం ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో తన తండ్రికి ఇష్టం లేదనే కారణంతోనే చరణ్ కూడా టాటూలకు దూరంగా ఉన్నారు.
![Telugu Ramcharan, Klin Kaara, Kuc Tattoo, Ram Charan, Tattoo, Tollywood, Upasana Telugu Ramcharan, Klin Kaara, Kuc Tattoo, Ram Charan, Tattoo, Tollywood, Upasana](https://telugustop.com/wp-content/uploads/2024/01/klin-kaara-special-song-ram-charan-upasana-daughter-detailsa.jpg)
ఇకపోతే ఇటీవల తనకు కుమార్తె పుట్టిన తర్వాత ఈయన ఒక టాటూ వేయించుకున్నారని తెలుస్తోంది.తండ్రికి ఇష్టం లేదని తెలిసినా రాంచరణ్ టాటూ వేయించుకున్నారు అంటే ఆ టాటూ ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మరి ఈయన వేయించుకున్నటువంటి ఆ టాటూ ఏంటి అనే విషయానికి వస్తే రాంచరణ్ తణుకు కుమార్తె పుట్టిన తర్వాత తన కుమార్తె క్లీన్ కారా ( Klin Kaara ) పేరులోని మొదటి అక్షరం అలాగే ఉపాసన( Upasana )రామ్ చరణ్ పేర్లలోని మొదటి అక్షరాలు మూడు కలిపి కేయూసి( KUC )అనే అక్షరాలను చాతిపై టాటూగా వేయించుకున్నారని తెలుస్తుంది.
![Telugu Ramcharan, Klin Kaara, Kuc Tattoo, Ram Charan, Tattoo, Tollywood, Upasana Telugu Ramcharan, Klin Kaara, Kuc Tattoo, Ram Charan, Tattoo, Tollywood, Upasana](https://telugustop.com/wp-content/uploads/2024/03/Ramcharan-touches-Upasana-feet-in-flight-journey-photo-goes-virala.jpg)
ఇప్పటివరకు టాటూలు అంటే ఏమాత్రం ఇష్టం లేనటువంటి రామ్ చరణ్ ఇలా చాతిపై ఈ మూడు లెటర్స్ కలిపి ఒక టాటూ గా వేయించుకున్నారు అని తెలియడంతో ఈయనకు తన భార్య కుమార్తెను ఎంత ప్రేమగా చూసుకుంటారో ఇక్కడే తెలుస్తుంది.ఇక ఎప్పటికప్పుడు రామ్ చరణ్ తన భార్య పట్ల ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ వచ్చారు.ఇటీవల ఏకంగా తన భార్య కాళ్ళను నొక్కుతూ భార్యకు సేవ చేస్తూ ఉన్నటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.