నంద్యాల జిల్లా నందికొట్కూరులో( Nandikotkur ) వైసీపీకి షాక్ తగిలింది.పార్టీని వీడిన నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్థర్( MLA Arthur ) కాంగ్రెస్ గూటికి చేరారు.
ఈ మేరకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) సమక్షంలో ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.అయితే రానున్న ఎన్నికల్లో భాగంగా నందికొట్కూరు వైసీపీ అభ్యర్థి డాక్టర్ దారా సుధీర్ ను పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే.

శాప్ ఛైర్మన్, నియోజకవర్గ కీలక నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో( Byreddy Siddhartha Reddy ) ఉన్న విభేదాల కారణంగా ఆర్థర్ టికెట్ కోల్పోయారని ప్రచారం జరుగుతోంది.ఈక్రమంలోనే పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆర్థర్ తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.







