Chandrababu Naidu : ‘ ప్రజాగళం ‘ వినిపించేందుకు చంద్రబాబు సిద్ధం 

త్వరలో ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి.ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటుకోవాలని ఉత్సాహపడుతున్నాయి.2019 ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా పోటీ చేసి కేవలం 23 సీట్లకే పరిమితం కావడంతో , ఈసారి ఆ తరహా ఫలితాలు రాకూడదనే ఉద్దేశంతోనే బిజెపి జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుంది.పొత్తుల ద్వారానే జగన్( YS Jagan Mohan Reddy ) ను అధికరానికి దూరం చేయాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు.

 Chandrababu Naidu : ‘ ప్రజాగళం ‘ వినిపి-TeluguStop.com

  అందుకే వ్యవహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో తమ కూటమి బలం పెరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు .మే 13న ఏపీలో ఎన్నికలు పోలింగ్ జరగబోతుండడంతో , దానికి అనుగుణంగానే స్పీడ్ పెంచుతున్నారు.ఇప్పటికే టిడిపి, జనసేన , బిజెపి ఉమ్మడిగా చిలకలూరిపేటలో ప్రజా గళం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు.

Telugu Ap, Ap Tdp, Chandrababu, Jagan, Jana Sena, Prajagalam, Tdp Manifesto, Ysr

ఈ సభ అనుకున్న మేరకు సక్సెస్ కావడంతో ప్రజాబలం( Prajagalam )పేరుతోనే ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు ( Chandrababu NAIDU )నిర్ణయించుకున్నారు.టిడిపి అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేసిన తర్వాత ఇక నిత్యం ప్రజల్లోనే ఉండే విధంగా చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు.  ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు టిడిపి అభ్యర్థులను ఖరారు చేశారు.

మరో పదహారు మందిని ఫైనల్ చేయాల్సి ఉంటుంది.ఒకటి రెండు రోజు ల్లో ఎంపీ అభ్యర్థుల పేర్లను సైతం ప్రకటించనున్నారు.

Telugu Ap, Ap Tdp, Chandrababu, Jagan, Jana Sena, Prajagalam, Tdp Manifesto, Ysr

 ఇక ఆ తరువాత పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి దిగేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.నేరుగా ప్రజల్లోకి వెళ్లి వైసిపి ప్రభుత్వం పాలనలో ఏపీకి జరిగిన అన్యాయం పైన ప్రజల్లో ఆలోచన రేకెత్తే విధంగా ప్రసంగాలు చేయాలని,  ప్రజలను ఆకట్టుకునే విధంగా రూపొందించిన టిడిపి మేనిఫెస్టో సూపర్ సిక్స్ ను జనాలకు అర్థమయ్యేలా వివరించి వారి మద్దతు పొందే విధంగా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ మేరకు ఎన్నికల ప్రచార తంతు ముగిసే వరకు ఏదో ఒక కార్యక్రమం పేరుతో ప్రజల్లో నిత్యం తిరిగే విధంగా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube