గుడి చెరువు పనుల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి స్వామి గుడి చెరువు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.గుడి చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ చెరువులో టూరిజం శాఖ ఆధ్వర్యంలో బండ్ పార్క్ లో కొనసాగుతున్న నిర్మాణాలను కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పి.గౌతమితో కలిసి సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా పార్క్, ఇతర నిర్మాణాల మ్యాప్ లను పరిశీలిస్తూ, క్షేత్రస్థాయి లో తనిఖీ చేశారు.

 Speed ​​should Be Increased In Temple Pond Works District Collector Anurag J-TeluguStop.com

నటరాజ విగ్రహాన్ని ఆలయ అర్చకుల సలహాలు, సూచనలు తీసుకొని, సంప్రదాయబద్దంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.మొక్కలు ఎక్కువ సంఖ్యలో నాటాలని, పిల్లలు ఆడుకునే స్థలం, నడిచే స్థలం విషయంలో అధికారులకు పలు సూచనలు చేశారు.

నూతన టెక్నాలజీకి అనుగుణంగా ఉండే ఆడుకునే వస్తువులు తీసుకోవాలని, పిల్లలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని సూచించారు.పనులు వచ్చే నెల ఆఖరు (ఏప్రిల్ ) లోగా పూర్తి చేయాలని టూరిజం శాఖ అధికారులను ఆదేశించారు.

అనంతరం అక్కడి నుంచి గుడి చెరువు ఆవరణలో కొనసాగుతున్న శివార్చన స్టేజ్ నిర్మాణ పనులను పరిశీలించి, ఆలయ ఈఈకి పలు సూచనలు చేశారు.అక్కడి నుంచి తిప్పాపూర్ బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ బండ్ పార్కును కలెక్టర్, అదనపు కలెక్టర్ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, టూరిజం డీఈ విద్యాసాగర్, జేఈ జీవన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్, ఆలయ ఈ ఈ రాజేష్, డీటీసీపీఓ అన్సారీ, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube